రతనాల సీమ చేస్తా : చంద్రబాబు 

Chandrababu Says He will develop Rayalaseema

03:37 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Chandrababu Says He will develop Rayalaseema

పగలు ప్రతీకాలకు నిలయంగా వున్న రాయలసీమకు పూర్వ వైభవం వస్తుందా? రాయలేలిన సీమ రతనాల సీమ అన్నది మళ్ళీ నిజం కాబోతోందా? సాధ్యం చేస్తానని అంటున్నారు ఎపి సిఎమ్ చంద్రబాబు. వివరాలలోకి వెళితే ,.....

మంగళవారం అనంతపురంలో నీరు - చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరు-ప్రగతి ప్రదర్శనశాలను గవర్నర్, ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వ రావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్‌, చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా పునరుద్ధరించడమే తన లక్ష్యమని స్పష్టం చేసారు. రాయలసీమ రతనాలసీమ అని అది ఇవాళ కరువు సీమగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువును చూసి భయపడాల్సిన పని లేదన్నారు. అనంతపురంలో 550 మిల్లీ మీటర్ల వర్షపాతం పడుతోందన్నారు. కరువు నివారణకు చర్యలు చేపట్టామన్నారు. నదుల అనుసంధానం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. భూమినే మనం జలాశయంగా మార్చుకుందామన్నారు. ఎక్కడికి అక్కడ చెక్ డ్యాంలు, చెరువులు నిర్మించుకుందామని చెప్పారు.

వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అనంతపురం హార్టికల్చర్ హబ్‌గా మారుతుంద ని సిఎమ్ చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని ఆయన చెబుతూ , రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.572 కోట్లు ఇచ్చామన్నారు. రైతుల రుణమాఫీ కోసం రూ.24వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామన్నారు. పెట్టుబడి నిధి కింద రూ.716 కోట్లు ఇచ్చామని చెప్పారు. తాము నిరంతరం విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కాగా ప్రభుత్వ కార్యక్రమాల పైన గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు

English summary