ఇద్దరి మధ్య  నెయ్యం - యాగానికి   'నెయ్యి '

Chandrababu Sends 4 Tons Of Ghee To Ayutha Chandi Yagam

07:05 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Chandrababu Sends 4 Tons Of Ghee To Ayutha Chandi Yagam

పార్టీ ఫిరాయింపులు , విమర్శలు - ప్రతి విమర్శలు టిఆర్ఎస్ - టిడిపి ల మధ్య నిత్యం నడుస్తున్నా కయ్యం కంటే,నెయ్యం బెటరని తెల్సుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆత్మీయ ఆహ్వానం అందుకుని అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్ అక్కడ ఏపీకి ఏం సహాయం కావాలన్నా చేస్తామని మాటిచ్చారు. అలాగే... ఇప్పుడు చండీయాగం చేస్తున్న కేసీఆర్ ఆహ్వానానికీ చంద్రబాబు ఓకే చెప్పారు. 27వ తేదీన ఆయన చండీయాగానికి వెళ్ల బోతున్నారు. . అంతేకాదు.... చండీయాగానికి భారీ ఎత్తున పూజాద్రవ్యాలు అవసరం కావడంతో చంద్రబాబు కూడా ఓ చేయి వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారీ ఎత్తున కెసిఆర్ చేస్తున్న అయుత చండీ యాగానికి 4 టన్నుల నెయ్యి అవసరం. అయితే అంతపెద్ద మొత్తంలో నెయ్యి ఒకేసారి సమకూర్చుకోవడం కాస్త ఇబ్బందైందట. అప్పుడు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ నుంచి కేసీఆర్ యాగానికి అవసరమైన నెయ్యిని పంపించినట్లు బోగట్టా.
విషయమేమంటే, అయుత చండీ యాగం కోసం అంతా ఆవు నెయ్యే వాడాలి. అయితే ఒక్కసారిగా అంత ఆవు నెయ్యి దొరికే పరిస్థితి లేకపోవడంతో హెరిటేజ్ ని కేసీఆర్ సంప్రదించినట్లు, దీంతో బాబు గారి ఆదేశంతో ఆఘ మేఘాలమీద అందుకు తగ్గ ఏర్పాట్లు చక చకా సాగాయని అంటున్నారు.

కానీ నెయ్యి కోసం చాలా ముందుగానే కేసీఆర్ సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం చాలాకాలంగా నెయ్యి తయారుచేసినట్లు తెలుస్తోంది. నమ్మకమైన కాంట్రాక్టర్లు ఒకరిద్దరు కొంత మేర సరఫరా చేసినా మిగిలిందంతా హెరిటేజ్ నుంచే సేకరించారని సమాచారం. హెరిటేజ్ అయితే కల్తీ ఉండదని కేసీఆర్ భావించడం వల్లే ఆ డెయిరీని ఎంచుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు కేసీఆర్ ల స్నేహం, ఇలా నెయ్యి సరఫరాతో మరింత బలపడి, పరిమళిస్తుందా. ఏది ఏమైనా వీరిద్దరి మహ్ద్య సఖ్యత వుంటే , ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు కూడా మేలేగా.

ఇక అయుత చండీ యాగంతో మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తోంది. రెండవరోజు గురువారం కూడా పలువురు ప్రముఖులు రావడంతో సందడే సందడి. విఐపి లకు , భక్తులకు విడివిడిగా ఏర్పాట్లు చేయడంతో ఎక్కాడా ఇబ్బంది లేకుండా సాఫీగా యాగం సాగిపోతోంది. జస్టీస్ జాస్తి చలమేశ్వర్ తదితర ప్రముఖులు గురువారం వచ్చారు. అన్ని చానెల్స్ , పత్రికలూ అన్నీ కూడా చండీ యాగంతో అదర గొట్టేస్తున్నాయి.

English summary

AP CM Nara Chandrababu Naidu Sends 4 Tons Of Ghee To Ayutha Chandi Yagam, which is doing by Telengana State CM K Chandrashekar Rao.