వైఎస్ దేవుడు... నేను రాక్షసుడినా?

ChandraBabu shocking speech about Tuni incident

12:39 PM ON 9th June, 2016 By Mirchi Vilas

ChandraBabu shocking speech about Tuni incident

ఏపీ సిఎమ్ చంద్రబాబు మీడియా సమావేశంలో బరస్ట్ అయ్యారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు వారంపాటు విజయవంతంగా జరిగిన నేపధ్యంలో వాటిని మీడియాతో పంచుకోవడానికి గురవారం ఉదయం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష గురించి ప్రస్తావన రావడం, దీని పై అడిగిన ప్రశ్నలకు సిఎమ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని ఇబ్బందులు సృష్టించొద్దు అని చంద్రబాబు కోరారు. కాపులకు తాము న్యాయం చేస్తామని అన్నారు. కాపులకు ఏమీ చేయని వైఎస్ దేవుడా, కాపులకు అన్నీ చేస్తున్న తాను రాక్షసుడినా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

కాపు రిజర్వేషన్ల పై కమీషన్ వేశామని, కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించామన్నారు. తునిలో కొందరు అరాచకం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయమై ముద్రగడకు తాను ప్రత్యేకించి హామీ ఇవ్వలేదని సీఎం స్పష్టం చేశారు. కాగా ఈలోగా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు వచ్చి చెవిలో ఏదో చెప్పడంతో సిఎమ్ అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించారు.

English summary

ChandraBabu shocking speech about Tuni incident