చంద్రబాబు జోక్‌ వేస్తే నవ్వరా మరి..

Chandrababu talking about uses of fiber grid

04:06 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Chandrababu talking about uses of fiber grid

ఆంద్రప్రదేశ్‌ సీ.ఎం నారా చంద్రబాబునాయుడు సీరియస్‌గానే ఉంటారు అనుకుంటే మీ పొరపాటే ఆయనలోనూ మంచి కామెడీ సెన్స్‌ ఉంది. వివరాల్లోకి వెలితే గురవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్ధులతో మాట్లాడారు చంద్రబాబునాయుడు. అప్పుడు చంద్రబాబు ఓ విద్యార్ధినితో జోక్‌ చేశారు.

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. కేవలం 150 రూపాయలకే టీవి, ఫోన్‌, నెట్‌ కనెక్షన్స్‌ ని దీనిద్వారా పొందవచ్చు. ఈ ప్రాజెక్టును గురువారం నాడు విశాఖలో ప్రారంభించారు. అందుమూలంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఫైబర్‌ గ్రిడ్‌ వల్ల కలిగే ఉపయోగాలను చెప్పమని ఓ విద్యార్ధినిని అడిగారు. దానికి విద్యార్ధిని ప్రపంచంలో ఎక్కడి వారితోనైనా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు అని సమాధానం తెలిపింది. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా మీ టీచర్‌ నవ్యాంధ్ర రాజదాని అమరావతి నుండే మీకు పాఠాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెప్పొచ్చు. మీరు కూడా ఇంట్లో ఉండే చదువుకోవచ్చు అని చంద్రబాబునాయుడు అన్నారు. ఇదిలా ఉండగా మీరు స్కూళ్లకు రాకుండా డుమ్మా కొట్టకూడదు అంటూ జోక్‌ చేయడంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు.

English summary

Chandrababu talking about uses of fiber grid.