8 వేల మందితో సిఎమ్  టెలి కాన్ఫరెన్స్

Chandrababu TeleConference With 8000 People At a Time

05:55 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Chandrababu TeleConference With 8000 People At a Time

టెలి కాన్ఫరెన్స్ లలో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఒకేసారి ఏకంగా 8వేల మందితో జన్మభూమిపై సీఎం రోజువారీ సమీక్ష నిర్వహించారు. ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంపై సిఎమ్ చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పేరు పేరునా ప్రస్తావిస్తూ అధికారులను నిలదీశారు. ఇక నాసిరం సరుకల పంపిణీపై ఈనాడులో వచ్చిన కధనంపై సిఎమ్ స్పందిస్తూ , నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నాసిరకం సరుకులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

English summary

Andhra Pradesh Cheif Minister Chandrababu Naidu conducts a teleconference on janmabhoomi event with almost 8000 people at a time.