ఒత్తిడితోనే క్రికెట్‌కు గుడ్ బై: చందర్ పాల్

Chandrapaul About His Retirement

10:31 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Chandrapaul About His Retirement

విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఒత్తిడి మేరకే తాను క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్‌ చందర్‌పాల్‌ ఆరోపించాడు. ప్రస్తుతం మాస్టర్‌ ఛాంపియన్స్‌ లీగ్‌లో ఆడుతున్న చందర్‌పాల్‌ వెస్టిండీస్‌ తరఫున టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 1994, మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చందర్‌పాల్‌ 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేయగా.. మరో దిగ్గజ ఆటగాడు బ్రయాన్‌ లారా 11,953 పరుగులతో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఏడాది ఫేలవ ఫామ్‌తో జట్టు నుంచి స్థానం కోల్పోయిన చందర్‌పాల్‌ మళ్లీ మైదానంలో నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విండీస్‌ బోర్డును అభ్యర్థించాడు. అయితే ఆస్ట్రేలియాలో పర్యటించే టెస్టు జట్టులో చందర్‌పాల్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపడంతో జనవరి 23న క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ 41 ఏళ్ల క్రికెటర్‌ ప్రకటించాడు. రెండు దశాబ్దాల పాటు దేశం తరఫున ఆడిన తనకి ఈ విధమైన వీడ్కోలు పలకడం ద్వారా యువ క్రికెటర్లకి ఎలాంటి సందేశం పంపుతున్నారని బోర్డుకు చందర్‌పాల్‌ చురక అంటించాడు. మాస్టర్‌ ఛాంపియన్స్‌ లీగ్‌లో పాల్గొనేందుకు నిరభ్యంతర పత్రాన్నితాను వెస్టిండీస్‌ బోర్డు నుంచి అందుకున్నట్లు చందర్‌పాల్‌ వెల్లడించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆటగాళ్లే ఈ లీగ్‌లో ఆడాలి.

English summary

West Indies Icon Player Shivnarine Chanderpaul said the reason behind his sudden retirement from international cricket.Chandra Paul says that due to pressure by the west Indies cricket board he had retired from cricket