కార్తికేయ కు సీక్వెల్‌..

Chandu Mondeti want to direct Karthikeya sequel

05:48 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Chandu Mondeti want to direct Karthikeya sequel

నిఖిల్‌, స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన 'కార్తికేయ' చిత్రం ఘనవిజయం సాధించి నిఖిల్‌ కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది. కార్తికేయ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు మొండేటినే సీక్వెల్‌ని కూడా తీస్తున్నారు. కార్తికేయ సినిమాలో కుమారస్వామి గుడి, అందులో పాము ఆ పాముని హిప్నటైజ్‌ చెయ్యడం వంటి కొత్త అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. తొలి సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుండి సీక్వెల్‌ని ప్రారంభించడానికి చందు మొండేటి కధను సిద్ధం చేశారట. అయితే చందు మొండేటి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న మజ్ను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక కార్తికేయ సీక్వెల్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది.

English summary

Chandu Mondeti want to direct Karthikeya sequel after completion of NagaChaitanya's Majnu movie.