శృంగారం కోసం నేవీలో భార్యలని మార్చుకుంటున్నారా!

Changing wives in Navy

12:14 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Changing wives in Navy

ఛీ ఛీ యావత్ భారతదేశం తలదించుకునేలా ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత నావికా దళం ప్రతిష్ట‌కు మ‌చ్చ‌ తెచ్చేలా కొంద‌రు నావికాద‌ళ అధికారుల‌ పై వచ్చిన ఫిర్యాదుల‌ పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మండిప‌డింది. ఈ ఫిర్యాదుల ప్ర‌కారం భార‌త త్రివిద‌దళాల్లో ఒక‌టైన కీల‌క‌మైన నేవీ శాఖ‌లో అధికారులు లైంగికానందం కోసం భార్యలను అక్రమంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2012లో వెలుగు చూసిన ఈ కుంభకోణం పై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

ఐఎన్ఎస్ కొచ్చి స్థావరంలో నావికాదళాధికారులు భార్యలను మార్చుకుంటూ శృంగార కార్యకలాపాలు జరుపుతున్నారని ఓ అధికారి భార్య 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త‌న భ‌ర్త పై స్థాయి అధికారి త‌న భ‌ర్త వ‌ద్ద‌కు వ‌చ్చి నీ భార్య‌ను(ఫిర్యాదుదారురాలిని) త‌న వ‌ద్ద‌కు శృంగారానికి పంపాల‌ని అడిగార‌ని, అయితే దీనిని త‌న భ‌ర్త తిరష్కరించ‌డంతో ఆ అధికారి త‌న భ‌ర్త‌ను తీవ్రంగా హింసించడంతో పాటు బెదిరించిన‌ట్టు ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విష‌య‌మై తాను కొచ్చి స్థావరంలోని సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

దీని పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఐఎన్ఎస్ కొచ్చి స్థావరంలో నావికాదళాధికారుల భార్యల మార్పిడి ఆరోపణల పై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కేరళ డీఐజీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్. భానుమతి ధర్మాసనం ఆదేశించింది. మ‌రి ఈ ద‌ర్యాప్తులో ఎలాంటి నిజాలు నిగ్గు తేల‌తాయో చూడాలి.

ఇది కూడా చదవండి: చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

English summary

Changing wives in Navy