'మహేష్‌ బాబు' గుట్టు విప్పిన క్యారక్టర్ ఆర్టిస్ట్!!

Character artist Hema revealed about her relation with Mahesh Babu

05:18 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Character artist Hema revealed about her relation with Mahesh Babu

అందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ 'హేమ' ఇటీవలే ఒక ఫంక్షన్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో తనకున్న అనుబంధం గురించి వివరించింది. మహేష్‌బాబు నటించిన 'అతడు' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హేమ ఆ చిత్రం షూటింగ్ లో మహేష్‌బాబుతో తనకున్న తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. అతడులో ఒక ముఖ్యమైన సన్నివేశం చిత్రీకరణ సమయంలో నా పెదవులకి చిన్న దెబ్బ తగిలింది. అప్పుడు నా రెండు పెదవులు ఉబ్బడంతో మహేష్‌ నన్ను ఆంజనేయుడు అని పిలిచేవారు. అంతే కాదు 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో ఆంజనేయుడు క్యారెక్ట్‌ర్‌ కి మీరు కరెక్ట్‌గా సరిపోతారని సరదాగా ఏడిపించేవారు.

మరోసారి సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు రాత్రి సమయంలో నేను పొడుకోకుండా ఉండడం గమనించిన మహేష్‌ అక్కడ కొంతమంది ఘాటింగ్‌ సిబ్బందికి చెప్పి నాకు బాన్‌ఫైర్‌, దుప్పటి ఏర్పాటు చెయ్యమన్నారు అంటూ మహేష్‌ తో తనకున్నా తీపి జ్ఞాపకాలని వివరించింది.

English summary

Character artist Hema revealed about her relation with Super Star Mahesh Babu. She get closed from Athadu movie.