వాకింగ్ తో చార్జింగ్‌..!

Charges Electrical Devices While Walking

10:28 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Charges Electrical Devices While Walking

సెల్ ఫోన్ వాడే వారందరికీ అతిపెద్ద సమస్య చార్జింగ్. ఇలాంటివారి కోసమే శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. సరికొత్త రీతిలో విద్యుత్తును తయారుచేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచారు. మానవ కదలికలతోనే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్ని చార్జింగ్‌ చేసే పరిజ్ఞానాన్ని రూపొందించారు. బూట్ల కదలికల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి, నిల్వ చేసే పరిజ్ఞానాన్ని విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనితో ఒకచోట నుంచి మరోచోటికి తీసుకెళ్లే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల విషయంలో బ్యాటరీలపై ఆధారపడటం తగ్గుతుందనీ, మనం ఎక్కడ ఉన్నా మన ఉపకరణాలకు విద్యుత్తు అందించే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. ఈ పరిజ్ఞానంలో బూట్లలో అమర్చే పరికరాలు.. నడిచేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్తును గ్రహించి నిల్వచేసి తర్వాత ఉపయోగించుకునేలా అందిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒక్కో బూటు నుంచి 10 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందనీ, నడక ద్వారా 20 వాట్ల విద్యుత్తును తయారు చేయడం చిన్న విషయమేమీ కాదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిజ్ఞానంలో యాంత్రిక శక్తిని విద్యుత్తు శక్తిగా మారుతున్నట్లు వివరించారు. విద్యుత్తు ఉత్పత్తి చేసే బూట్లు సైనికులకు చాలా ఉపయోగమని చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికీ, విద్యుత్తు తీగలు సరిగా అందుబాటులో లేనివారికీ ఈ పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

English summary