తాగిన మత్తులో కండోమ్ పెట్టుకోని కారణంగా ఆ స్టార్ కి హెచ్ఐవి?

Charlie Sheen has HIV virus

03:13 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Charlie Sheen has HIV virus

భయంకరమైన హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి ఎన్ని హెచ్చరికలు చేసినా ఫలితం అంతంత మాత్రమే అన్నట్టు వుంది. కారణం దీని గురించి పెద్ద పెద్ద స్టార్ లు కూడా అప్రమత్తంగా లేకపోవడమే.. ఇక ప్రముఖ హాలీవుడ్ నటుడు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడ్డాడంటూ హాలీవుడ్ సర్కిల్ లో ఒకప్పుడు హాట్ టాపిక్ నడిచింది. హాలీవుడ్ లో ప్లే బాయ్ గా పేరున్న ఆ నటుడు ఈ ప్రచారంతో మీడియా ముందుకు వచ్చి నిజం ఒప్పుకోక తప్పలేదు. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తానే స్వయంగా టీవీ షోలో ఈ విషయం ఒప్పుకున్నాడు. తనకు నాలుగేళ్ల క్రితమే ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయిందని, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

అయితే తాజాగా ది సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగేళ్ల క్రితం తాను తాగిన మత్తులో చేసిన తప్పే హెచ్ఐవి బారిన పడటానికి కారణం అయి ఉండొచ్చని చార్లీ షీన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుండి తాను చికిత్స పొందుతున్నానని, గతంలో తాను తాగిన మత్తులో కండోమ్ మరచానని... ఆ సమయంలోనే వైరస్ తనకు వ్యాపించి ఉండొచ్చని అభిప్రాయ పడ్డాడు. తరచూ కండోమ్స్ యాడ్స్, హెచ్ఐవి మీద అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కనిపించే చార్లీ షీన్ తాను దురదృష్టవంతుడినని అంటున్నాడు. హెచ్ఐవి సోకిన విషయం తెలిసిన తర్వాత కొన్ని నెలల నుండి శృంగారంలో పాల్గొనడం లేదని, కొన్ని సార్లు పాల్గొన్నా తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

తాను ఎవరికీ వైరస్ అంటించలేదని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చార్లీ షీన్. నాలుగేళ్ల పాటు ఈ రహస్యాన్ని దాచడానికి, విషయం బయట పెడతానని తనను బ్లాక్ మెయిల్ చేసిన వారికి రూ. 66 కోట్ల వరకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవి అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలు కొనసాగించాడని వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చాడు. అయితే అతనితో గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్... చార్లీ షీన్ తనతో ఎప్పుడూ హెచ్ఐవి ఉందన్న విషయం చెప్పలేదని, ఐయామ్ క్లీన్ అని చెప్పేవాడని, ఉద్దేశ్య పూర్వకంగానే అతడు విషయాన్ని దాచాడని మీడియాకు చెప్పడంతో... చార్లీ షీన్ విషయం వెలుగులోకి వచ్చింది.

టెస్టుల్లో తనకు హెచ్ఐవి నెగెటివ్ అని వచ్చిందని ఆమె వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలను చార్లీ షీన్ ఖండిస్తూ, ఆమెతో విడిపోయే నాటికి హెచ్ఐవి ఉందనే విషయం నాకు కూడా తెలియదని అంటున్నాడు. తనకు వచ్చిన వ్యాధిని అందరికీ అంటించడం ఎందుకనే కామెంట్లు పడిపోతున్నాయి.

English summary

Charlie Sheen has HIV virus