ఛార్మిను ఏడ్పించిన దేవి శ్రీ

Charmi Cries At IIFA Event

05:09 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Charmi Cries At IIFA Event

ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన ఐఫా ఉత్సవాలలో హీరోయిన్‌ ఛార్మి ఏడుస్తూ కనిపించింది. ఛార్మి ను శ్రీయ ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఫోటో ఆన్ లైన్లో చక్కర్లు కొడుతుంది . ఛార్మి ఐఫా ఉత్సవం లో జరిగిన ఒక సంఘటన వల్ల ఉద్వేగానికి లోనై తనకి తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయిందట. నిజానికి ఛార్మి ఏడవడానికి అసలు కారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన స్టేజి షో తరువాత ఇటీవలే మరణించిన తన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తికి అంకితమిస్తూ స్వయంగా పాడిన వీడియోను పెట్టగా దాన్ని చూసి చలించిపోయిన ఛార్మి వెక్కి వెక్కి ఏడ్చింది .

అందం , ప్రతిభ ఉన్న హీరోయిన్‌ ఛార్మి. ఇప్పుడు తన కెరీర్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈమె సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోవడం ఛార్మికి అవకాశాలు తగ్గాయి. ఇంతకు ముందు వచ్చిన కొన్ని సినిమాలలో ఛార్మి ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది. ఛార్మి బుడ్డా హోగా తెర బాప్‌, ఆర్‌ రాజ్‌కుమార్‌ వంటి హిందీ చిత్రాలలో కనిపించింది. అయినప్పటికి మంచి అవకాశాలు ఏమి రాలేదు. ఒక పెద్ద హిట్‌ ద్వారా మళ్ళీ తన పూర్వపు వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఛార్మి ఎదురుచూస్తుంది.

English summary

Charmi cries at IIFA Utsavam event which was held at Gachibouli stadium hyderabad.The reason behind that was When music Director Devi Sri Prasad after his performance he dedicated a song to his father who was died recently