వారి కోసం తన జట్టునే త్యాగం చేసింది

Charmi cuts her hair for 2 patients

05:46 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Charmi cuts her hair for 2 patients

బాపు బొమ్మలోని కుందనపు బొమ్మకు ఉన్నంత పెద్ద వాలు జడ ఛార్మికి ఉండేది. అది కాస్తా బార్బీ గాల్ జుట్టుగా మారిపోయింది. సగానికి సగం కత్తిరించేసింది. ఇంత సడెన్ గా ఛార్మి జుట్టు సగానికి సగం ఎందుకు తగ్గిపోయింది? తన కొత్త సినిమా కోసం ఆమె ఈ లుక్ లో దర్శనమివ్వబోతుందా? లేక ఇప్పుడున్న హీరోయిన్లకు పోటీ ఇవ్వడానికి ఇలా మోడ్రన్ గా తయారవుతోందా? అనే ప్రశ్నలు మీలో మొదలయ్యాయా? అయితే ఇవేవీ సమాధానాలు కావు. ఓ ఛారిటీ కార్యక్రమం కోసం ఛార్మి ఇలా తన జుట్టును త్యాగం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను ఈమధ్య ఛార్మి కలిసింది.

కీమో థెరపీ చేయించుకున్న వాళ్లిద్దరి జుట్టు మొత్తం ఊడిపోయింది. వాళ్లిద్దరూ ఛార్మి జుట్టును పొగడ్డం ఆమెకు చాలా బాధేసింది. అందుకే వాళ్ల కోసం తన జుట్టును త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. హెయిర్ స్టైలిస్ట్ ని పిలిపించి తన జుట్టుని కత్తిరించేయమని ఆదేశించింది. అలా కత్తిరించిన జుట్టుతో, ఇద్దరు పేషెంట్లకు విగ్గులు తయారు చేయిస్తోంది. ప్రస్తుతం ఛార్మి హెయిర్ లోని 18 అంగుళాల పొడుగున అంటే అడుగున్నర మేర కత్తిరించిన జుట్టుతో రెండు మంచి విగ్గులు తయారు చేస్తున్నారట. ఈ విగ్గులు రెడీ అయ్యాక తనే స్వయంగా వెళ్లి అందిస్తానని, వాటిని అందుకునేటప్పుడు వారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూడాలని అనుకుంటున్నానని ఛార్మి చెబుతుంది. ఛార్మి చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.

English summary

Charmi cuts her hair for 2 patients