ఛార్మిని హేండిల్ చేసేదెవరు?

Charmi producing a new movie

01:33 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Charmi producing a new movie

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించే చరిష్మా గల హీరోయిన్ ఛార్మి గురించి కొత్త విషయం బయట పడింది. ఆమె లేటెస్ట్‌గా ఓ సినిమా నిర్మించే పనిలో పడినట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్‌లో ‘జనగణ మన’ పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించిందని టాక్ నడుస్తోంది. పేరు బట్టి చూస్తుంటే ఇది పూర్తిగా దేశభక్తి మూవీ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్-కృష్ణవంశీ ఇలాంటి టైటిల్ రిజిస్టర్ కోసం ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల డిలే అయ్యింది... ఇప్పుడు ఛార్మి ఛాన్స్ కొట్టేసింది. అంతవరకూ బానే ఉన్నా, అసలు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు?

ఇది కూడా చదవండి: ఛ అవేం ప్రశ్నలు... అక్కడ వాటి సైజులు అడుగుతున్నారట

గతంలో రెండు సినిమాలకు కో- ప్రొడ్యూసర్‌గా ఈ బ్యూటీ వ్యవహరిస్తే, ఈసారి మాత్రం డైరెక్ట్ నిర్మాతగా ముద్ర పడాలని తెగ ఆరాటపడుతోందని టాలీవుడ్ లో టాక్. ఇక, ఇటీవల ఈమెకి-పూరీకి మధ్య విబేధాలొచ్చాయని వార్తలు షికారు చేసాయి. మరి ఈ న్యూప్రాజెక్ట్‌ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్న వినిపిస్తోంది. చూద్దాం కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుందిగా...

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

English summary

Charmi producing a new movie. Hot actress Charmi registered a new title for her new movie with the name Jana Gana Mana.