సుల్తాన్ పై కేసు

Cheating case filed against Salman Khan

11:28 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Cheating case filed against Salman Khan

ఈమధ్య సినిమాల స్టోరీ , పాటలు వంటి వాటికి సంబంధించి జోరుగానే కేసులు నమోదవ్వడం తెల్సిందే. దీనివలన కేసులు నమోదై, ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. తాజాగా సల్మాన్ నటించిన సుల్తాన్ మూవీ విడుదలైన వారం రోజులకే వివాదం అలుముకుంది. ఈ మూవీ స్టోరీ తనదేనంటూ లాయర్ ద్వారా సల్మాన్, అనుష్క శర్మ, ఓ డైరెక్టర్ పై ఓ వ్యక్తి కేసు ఫైల్ చేయించాడు. ఆసక్తి రేపిన ఈ యవ్వారం యూపీలోని ముజఫర్ నగర్ లో వెలుగుచూసింది. సల్మాన్- అనుష్క నటించిన సుల్తాన్ మూవీ ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కోట్ల రూపాయలు వసూలు రాబడుతున్న ఈ చిత్రంపై అప్పుడే వివాదం మొదలైంది.

తన లైఫ్ స్టోరీ ఆధారంగానే ఈ ఫిల్మ్ ని తెరకెక్కించారంటూ ముజఫర్ నగర్ కు చెందిన మొహ్మద్ సాబిర్ అన్సారి అలియాస్ సబీర్ బాబా సల్మాన్ తో పాటు డైరెక్టర్ అలీ అబ్బాస్, హీరోయిన్ అనుష్క శర్మలపై చీటింగ్ కేసు పెట్టాడు. కోర్టులో సాబిర్ తరపు న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా కేసుని ఫైల్ చేశారు. సాబిర్.. ఆరేళ్ల కిందట తన స్టోరీని సల్మాన్ కు వినిపించాడట. ఆ టైమ్ లో ఈ స్టోరీతో సినిమా తెరకెక్కించి తనకు రూ. 20 కోట్లు చెల్లిస్తానని సల్మాన్ మాట ఇచ్చాడన్నది సాబిర్ వాదన. ఫిల్మ్ విడుదలైంది.. కానీ ఒక్క పైసా కూడా చేతికి రాకపోవడంతో ఏకంగా ఫిర్యాదు చేశాడు. ఇక హర్యానాలోని ఓ రెజ్లర్ లైఫ్ స్టోరీ ఆధారంగా ‘సుల్తాన్’ను తెరకెక్కించినట్టు యూనిట్ అంటోంది. అలాంటప్పుడు ఈ సబీర్ వ్యవహారమేమిటో అంతుచిక్కడం లేదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: పవన్ మీసం మెలేసి మాట్లాడుతూ ఫ్యాన్స్ కు చెప్పిందేంటి(వీడియో)

ఇది కూడా చూడండి: సంజీవని గురించి మీకు తెలియని రహస్యాలు!

ఇది కూడా చూడండి: సులభంగా సిక్స్ ప్యాక్ పొందడం ఎలా?

English summary

Cheating case filed against Salman Khan.