జక్కన్న పై చీటింగ్ కేసు

Cheating Case on Rajamouli

03:40 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Cheating Case on Rajamouli

బాహుబలి తో అంతర్జాతీయ స్థాయికి చేరి , బాహుబలి -2లో బిజీ బిజీ గా వున్న ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి చీటింగ్ చేసాడా? పైగా పద్మశ్రీ పురస్కారం కూడా కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో చీటింగ్ గొడవేంటి? కోర్టు ఆదేశం మేరకు పోలీసులు అందజేసిన సమన్లు కూడా వెళ్ళాయి. అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. జక్కన్న ఫ్లాట్‌ కు సంబంధించిన వివాదం నేపధ్యంలో ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీచేసింది. బంజారాహిల్స్ పోలీసులు ఆయన నివాసంలో గురువారం ఈ నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని లోటస్‌హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో (జి-1) ఫ్లాట్ రాజమౌళి పేరిట ఉంది. దీనిని 2011 అక్టోబర్‌లో అమ్మకానికి పెట్టగా, సినీ నిర్మాత భువనేశ్వర్ రూ.41లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొన్నారట. అయితే రాజమౌళి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ ఫ్లాట్‌ను వేరొకరికి విక్రయించి తనను మోసం చేసాడని భువనేశ్వర్ అభియోగం. ఈమేరకు నాంపల్లి కోర్టులో కేసు వేయడంతో రాజమౌళిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. అదండీ సంగతి. దీంతో బాహుబలి షూటింగ్ లో బిజీగా వున్న జక్కన్నకు తలనొప్పి లా ఈ ఘటన మారిందని అంటున్నారు. అయితే రాజమౌళి ఈ కేసుకి సంబదించి ఎలాంటి వ్యాఖలు చేయలేదు.

English summary

Cheating case filed on the Tollywood Top Director S.S.Rajamouli.According to news that came to know Rajamouli had A Flat in Lotus Heights Apartment and he decided to sell it to Producer Bhuwaneswar for 41 lakhs and they had made an agreement too.But Rajamouli sells his flat to another member by breaking this agreement.So producer Bhuwaneswar filed a case on Rajamouli on Nampally Court and Nampally Court Ordered police to file Cheating case on Rajamouli