ఈ నెంబర్ తో మీ ఫోన్ లో ఎంత రేడియేషన్ వస్తుందో చెక్ చేసుకోండిలా..

Check you phone SAR value with this number

12:58 PM ON 12th November, 2016 By Mirchi Vilas

Check you phone SAR value with this number

ఇప్పుడు ఎక్కడ చూసినా రేడియేషన్ ప్రభావం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, ముఖ్యంగా సెల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వలన వాటినుంచి విడుదలయ్యే రేడియేషన్ మనిషి శరీరానికి హాని కలిగిస్తోందని అంటున్నారు. ఇది కొత్తగా ఇప్పటికిప్పుడు వినిపిస్తున్నది కానే కాదు. సెల్ ఫోన్లు మొదటిసారిగా వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి మనకు దీన్ని గురించి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంతకీ అసలు ఆ రేడియేషన్ మన శరీరానికి ఏ విధంగా హాని కలిగిస్తుంది..? దాంతో మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి..? అసలు ఓ సెల్ ఫోన్ కు రేడియేషన్ స్థాయి ఎంత ఉంటుంది..? దాన్నుంచి మనం జాగ్రత్తగా ఉండడం ఎలా..? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...

1/10 Pages

స్పెసిఫిక్ అబ్జార్ ప్షన్ రేట్ గురించి మీరు వినే ఉంటారు. సైన్స్ సబ్జెక్టు చదువుకున్న వారికైతే దీని గురించి అవగాహన ఉంటుంది. దీన్నే SAR Value(సార్ వాల్యూ) అని కూడా పిలుస్తారు. దీన్ని తెలుగులో విశిష్ట శోషణ గుణకం అని కూడా అంటారు. అంటే నిర్దిష్ట పరిమాణంలో బరువు ఉన్న వ్యక్తికి చెందిన 1 కిలో ద్రవ్యరాశి ఉన్న శరీరం లోపలికి గ్రహించే శక్తి విలువ అది. రేడియో తరంగాలతో కలిసి ఉన్న ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ కు మనిషి శరీరం గురైనప్పుడు ఆ శరీరం సదరు తరంగాల నుంచి విడుదలయ్యే శక్తిని తనలోకి శోషించుకునే రేటునే స్పెసిఫిక్ అబ్జార్ ప్షన్ రేట్ అని అంటారు. ఇది మనిషి ఉన్న బరువును బట్టి మారుతుంది. కానీ ఏదైనా ఒక సెల్ ఫోన్ కు మాత్రం ఒకటే SAR Value ఉంటుంది. దాన్ని బట్టి మన శరీరం ఆ ఫోన్ నుంచి రేడియో తరంగాల శక్తిని లోపలికి గ్రహిస్తుంది.

English summary

Check you phone SAR value with this number