నాగబాబు వ్యాఖ్యలపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Cheeranjeevi Shocking comments on Nagababu

10:47 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Cheeranjeevi Shocking comments on Nagababu

తొమ్మిదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా నడిచింది. అయితే ఈ వేడుక సినిమాకు ఎలాంటి ప్రమోషన్ తెచ్చిందో ఏమో గానీ వివాదాలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ,రచయిత యండమూరి వీరేంద్రనాద్ లపై నాగబాబు చేసిన విమర్శలు దుమారం రేపాయి. ఈనేపధ్యంలో చిరంజీవి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ దుమారంపై స్పందించాడు.

'హర్టయ్యాడు కాబట్టి ఫంక్షన్ల లో నాగబాబు అలా రియాక్టయ్యాడు. నిజానికి మేం కూడా అలాంటి మాటలు విన్నప్పుడు హర్టవుతుంటాం. కానీ వాటికి నేను రియాక్ట్ కాను. అసలు వాటిని పట్టించుకోను. అందరూ ఒకలాగా ఉండరు కదా. అందుకే నాగబాబు రియాక్టయ్యాడు. అది అతని గుణం. అతని ఎక్స్ ప్రెషన్ గురించి మాట్లాడుకోవాలి కానీ, అతను వాడిన పదాల గురించి కాదు. దానిపై తర్జనభర్జనలు అవసరం లేదు. తన తరపునుంచి అదేమీ తప్పు కాదు. నేను పాజిటివ్ గా ఉండాలనుకుంటా. పాజిటివ్ గా ఆలోచిస్తుంటా' అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
ఇంకా చిరు స్పందిస్తూ 'మనపై వస్తున్న విమర్శకులపై ఫోకస్ పెట్టేకొద్దీ, రియాక్టయ్యే కొద్దీ వాటికి ఎక్కువ విలువిచ్చినట్లవుతుంది. మనం పట్టించుకోకపోతే వాటి విలువ కూడా తగ్గిపోతుంది. నా ఫ్యాన్స్ కూడా నా ఫిలాసఫీ ఫాలో అవుతుంటారునుకుంటా. వాళ్లు కూడా ఇలాంటి విమర్శల్ని పెద్దగా పట్టించుకోరు. అయితే చిరంజీవి అందరికీ సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాడేంటి? అని అభిమానులు హర్ట్ అవుతుంటారు. అందువల్ల అనాలోచితంగా ఒకర్ని హర్ట్ చేయడమనేది ఎంతవరకు కరెక్టనేది అవతలి వాళ్లు ఆలోచించుకోవాలి. అలా విమర్శలు చేసేవాళ్లని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తా. ఇక రామ్ గోపాల్ వర్మ గొప్ప వ్యక్తి. ఆయనతోటి నాకెందుకు గొడవలుంటాయి? మేం మంచి స్నేహితులుగానే ఉంటాం. ఎప్పుడు ఎదురుపడినా మాట్లాడుకుంటాం. ఆయనతోనే కాదు, ఎవరితోటీ ఏ గొడవలూ ఉండవు. అలాంటి గుణం మా కుటుంబంలోనే లేదు'అని వివరించాడు.

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: ఖైదీ నం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
ఇది కూడా చూడండి: మెగా బ్రదర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు

English summary

Cheeranjeevi responede for the comments of Nagababu recently he said that, Nagababu got hurted with the comments of Ramgopal varma and Yandamure virendranath so he spoken like that.Even we also felt very unhappy with their words,But did not reacted.