ఘోర కలికి నిదర్శనాలు ఇవే

chennai floods updates

05:16 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

chennai floods updates

చెన్నై ఎన్నడూ లేనటువంటి ఘోర విపత్తును అనుభవిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న వరద నీరు చెన్నై మహానగరాన్ని కకావికలం చేసింది. వంద సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక వర్షపాతం కారణంగా రోడ్లు, ఎయిర్‌పోర్టు, ఇళ్ళు వరద నీటితో ముంచెత్తాయి. చెన్నై ఎయిర్‌పోర్టు పూర్తిగా నీట మునిగి నదిపై ఎయిర్‌పోర్టును కట్టారా అన్న చందంగా తయారైంది. ఇక్కడ ఒకప్పుడు ఎయిర్‌పోర్టు ఉందన్న దాఖలాలు కూడా లేకుండా నీటి అన్నివైపులా ముంచెత్తింది. దీంతో ఎయిర్‌పోర్టును పూర్తిగా మూసివేశారు. అడయార్‌ నది ఒడ్డున నిర్మించిన ఎయిర్‌పోర్టులోకి నది కట్టలు తెంచుకుని ప్రవహించడంతో నీరు వచ్చి చేరింది. దేశంలో నడి ఒడ్డున నిర్మించిన ఏకైక ఎయిర్‌పోర్టు చెన్నైది కావడం విశేషం.

వేలాది మంది ప్రజలు ఇంకా ఇళ్ళనుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. డ్రైనేజీలు, రోడ్లు వెంబడి నీరు నదుల్లా ప్రవహించడంతో నగరం మొత్తం నదిని తలపిస్తోంది. చెన్నై రైల్వే స్టేషన్‌ కూడా పూర్తిగా నీట మునగడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణికులు సైతం గత రెండు రోజుల నుండి నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. కేవలం బిస్కట్లు ఆహారంగా తీసుకుంటే ఎంతో మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా జనం అల్లల్లాడుతుంటే ఈ విపత్కర పరిస్థితులను కూడా డబ్బు చేసుకునే వ్యాపారులు లేకపోలేదు. జనసామాన్యానికి నిత్యం అవసరమయ్యే పాలు, తాగు నీళ్ళను కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లీటర్‌ పాలు కొన్ని చోట్ల 100రూపాయలకు కూడా అమ్ముతున్నారట. కూరగాయలు ధరలు అయితే ఆకాశాన్ని దాటిపోతున్నాయి. కిలో టమాటా, బంగాళా దుంపలు 80నుండి 90రూపాయలకు అమ్ముతున్నారు. గత రెండురోజులుగా ఎలక్ట్రిసిటీ కూడా లేకపోవడంతో పాలు, కూరగాయలు నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడంతో వాటి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి.

లీటరు వాటర్‌ బాటిల్‌ ధర సాదారణంగా 20రూపాయలు ఉంటే, ఈ వరదల వేళ 100రూపాయలకు అమ్ముతూ జనాన్ని దోచుకుంటున్నారు.

జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ వరదల దాటికి ఇప్పటికే 300మందికి పైగా మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా కురుస్తున్న వర్షం ఎప్పటికే తగ్గుతుందో కూడా తెలియడం లేదు. వరదల వలన రవాణా, సమాచార వ్యవస్థ మొత్తం స్థంభించడంతో ఆపదలో ఆదుకునే వారే లేరు. అనారోగ్యంతో మృతి చెందిన తన తల్లి వద్ద బితుకుబితుకు మంటూ 20గంటలకు పైగా ఒక మహిళ గడపాల్సిన దుస్థితి వచ్చింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తనతల్లి గత రాత్రి మృతిచెందింది. కానీ ఆ వార్తను తెలిపేందుకు ఎటువంటి సమాచార వ్యవస్థ పనిచేయడం లేదు. ఆఖరికి మృతదేహాన్ని మార్చురీకి పంపేందుకు రోడ్లన్నీ నీట మునిగిపోవడంతో ఎటువంటి వాహనం రాలేదు. అలా 20గంటలు పాటు కటిక చీకటిలో పక్కన శవంతో ఆ మహిళ ఆ రాత్రంతా గడపాల్సిన దుస్థితి వచ్చింది.


English summary

Here are the latest updates from chennai floods. Chennai flooded by heavy and continuous rain. Due to rain water on the chennai airport runway the airport remains closed and the flight were turned towards banglore airport, trains have been cancelled and the army and navy is helping rescue stranded people