ఈ బిల్డింగ్ ని బాంబులతో పేల్చేశారు ... ఎందుకంటే...

Chennai Moulivakkam eleven Storey Building Demolition video

03:51 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Chennai Moulivakkam eleven Storey Building Demolition video

తమిళనాడు రాజధాని చెన్నైలోని మౌలివాకంలో 11 అంతస్థుల భారీ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. నాశిరకం నిర్మాణంతో రెండేళ్ళ కిందట కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 61 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భవన నిర్మాణ తీరును పరిశీలించిన అధికారులు చివరకు దాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీనికి ఓ ముహూర్తం కూడా ఖరారు చేశారు. బుధవారం ఆ భవంతి వద్దకు పోలీసులు, అధికారులతో పాటు మీడియా సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమీపంలోని నివాసితులను అధికారులు దూరంగా తరలించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని బాంబులతో దాన్ని కూల్చివేశారు. ఈ భారీ బిల్డింగ్ ను బుధవారం బాంబులతో కూల్చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 నాలుగు గంటలకు జరగాల్సిన కూల్చివేత, మూడు సార్లు వాయిదా పడింది. ఈ కార్యక్రమం రేపటికి వాయిదా పడుతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా సాయంత్రం 6.51 గంటలకు నిర్మాణంలో ఉన్న భారీ భవంతిని అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ తీరుని పలువురు కొనియాడారు.

ఇది కూడా చూడండి: డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాలుక ఎందుకు చూస్తారో తెలుసా?

ఇది కూడా చూడండి: ఇవి తింటే ఆరోగ్యానికి డోకా లేదట

English summary

Chennai Moulivakkam eleven Storey Building Demolition video.