దేశంలోనే విలాసవంతమైన మల్టీప్లెక్స్‌!!

Chennai Palaaza multiplex is the India's richest multiplex

05:24 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Chennai Palaaza multiplex is the India's richest multiplex

సినిమా ధియేటర్లంటే చిన్నప్పుడు మనం చూసే ధియేటర్లు లాగే ఉండాలా అని ఎవరో ఆలోచించారు. ఇలా కాకుండా ఒక మల్టీప్లెక్స్‌లా ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించారు. ఆ ఆలోచనతోనే మల్టీప్లెక్స్‌లు నిర్మించారు. మన రాష్ట్రానికి వచ్చే సరికి హైదరాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ 'ప్రసాద్స్‌ ఐమాక్స్‌ ' ని చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత పీవీఆర్, బిగ్‌ సినిమాస్‌, సినీ మ్యాక్స్‌, జీవీకేవన్‌, ఇనోర్బిట్ మాల్‌, ఫోరమ్‌ వంటి మల్టీప్లెక్స్‌లు మరింత భారీ హంగులుతో నిర్మించబడ్డాయి. అయితే మన మల్టీప్లెక్స్‌లైనా, దేశంలో మల్టీప్లెక్స్‌లైనా చెన్నైలో ప్రారంభమయిన సరికొత్త 'పలాజా' మల్టీప్లెక్స్‌ ముందు చిన్నబోవాల్సిందే.

మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి మల్టీప్లెక్స్‌లు చాలా అరుదు. అసలు అంతగా ఇందులో ఏముందో చూద్దామా? చెన్నైలో సినీస్టార్లు ఉండే వడపల్లి ఏరియాలో కొత్తగా మొదలైన 'పలాజా' మల్టీప్లెక్స్‌. ఇది మల్టీప్లెక్స్‌ అని తెలియకుండా లోపలికి వెళ్తే మాత్రం ఎరరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆకాశంలో ఇంద్రుడు ఉండే భవనం కూడా ఉండదేమో అన్నట్లు దీన్ని నిర్మించారు యజమానులు. బాక్సాఫీస్‌, రిఫ్రెష్‌మెంట్‌ ఏరియా, ఫర్నిచర్‌ అన్నీ లగ్జరీగా తీర్చిదిద్దారు. ఇక ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 9 స్క్రీన్లు ఉన్నాయి. ప్రతీ స్క్రీను ఎంతో భారీ తనంగా రూపొందించారు. చెన్నైలో నిన్ననే దీన్ని ప్రారంభించారు.

English summary

Chennai Palaaza multiplex is the India's richest multiplex. In this multiplex their is 9 screens.