ఇంకా వరద నీటిలోనే ..... ఆగని వాన భయం 

Chennai Still In Flood Water

01:13 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Chennai Still In Flood Water

అల్పపీడన ద్రోణి , అనుబంద ఆవర్తనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు మహా నగరం చెన్నై అతలాకుతలమైంది. వరద నీటిలో చాలా ప్రాంతాలు చిక్కు కున్నాయి. రవాణా వ్యవస్థ , సాంకేతిక వ్యవస్థ , విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐటి సంష్టల్లో ఉద్యోగులు రెండు మూడు రోజులుగా ఆఫీసుల్లోనే ఉండిపోయారు. ఇన్ఫోసిస్ వంటి సంస్థల కార్యలయాల్లోకి నీళ్ళు చేరాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో సైతం ఉద్యోగులు చిక్కున్నారు. రైల్వే స్టేషన్,, ఎయిర్ పోర్ట్ నీట మునగడంతో విమాన సర్వీసులు , రైళ్ళు రద్దయ్యాయి. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అయినా జలదిగ్బంధంలో చాలా ప్రాంతాలు కొట్టు మిట్టాడుతున్నాయి. ఓ పక్క సహాయక చర్యలు చేపడుతున్నా , మరోపక్క వాన భయం వెంటాడుతోంది. మరో రండు మూడు రోజులు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో చెన్నై వాసులు గజ గజ వణికిపోతున్నారు.

కాగా చెన్నై వరదలపై లోక సభలో గురువారం హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటన చేసారు. చెన్నైలో వందేళ్ళ తర్వాత రికార్డు స్థాయి వర్ష పాతం నమోదైందని చెప్పారు. చెన్నై వరదల్లో 269మంది మరణించారని 40% టెలి కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతిందని , చెన్నై , పుదుచ్చేరి లలో ఆర్మీ , ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. మరో 2,3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారని ఆయన తెల్పారు. వరద నీరు కారణంగా చెన్నై రైల్వే స్టేషన్ మూసివేసినట్లు ఆయన తెల్పారు.

English summary

Chennai flooded by heavy and continuous rain. Due to rain water on the chennai airport runway the airport remains closed and the flight were turned towards banglore airport, trains have been cancelled and the army and navy is helping rescue stranded people