చవితికి 'ధ్రువ' టీజర్

Cherry Dhruva Movie Teaser Release on Vinayaka Chavithi

11:22 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Cherry Dhruva Movie Teaser Release on Vinayaka Chavithi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో హ్యాపీ అయిన టీమ్, ఫస్ట్ టీజర్ ను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తోందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. హిపాప్ తమిజా అందించిన ఆడియో సెప్టెంబర్ నెలాఖర్లో విడుదల కానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్ ’కి రీమేక్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

సెప్టెంబర్ 5న వినాయక చవితి సందర్భంగా ఈ ఫస్ట్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. ప్రస్తుతం టాకీ పార్ట్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమాంతరంగా జరుగుతోంది.

ఇది కూడా చూడండి: దిమ్మతిరిగే పచ్చి నిజాలు

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

English summary

Ram charan and Rakul Preet Singh upcoming fim Dhruva. the movie directed by Surender Reddy. According to film nagar news Cherry Dhruva Movie Teaser Release on Vinayaka Chavithi special.