జంపింగ్ ఎమ్మెల్యే తాగుబోతుగా మారిపోయాడట!?

Chevireddy Bhaskar Comments On Jumping MLAs

05:07 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Chevireddy Bhaskar Comments On Jumping MLAs

అవునా ఇదెక్కడి చోద్యం అండీ బాబూ...ఎవరైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం చేస్తాం? కాసేపు బాధపడతాం.. ఇక తర్వాత నుంచి జాగ్రత్త పడతాం! మరి రాజకీయాల్లో ఉన్నవారైతే ఏం చేస్తారు? ఎప్పుడు వేరే పార్టీలోకి వెళిపోదామా అని చూస్తారు! అయితే ఇక్కడో రాజకీయ నాయకుడికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక పార్టీలో ఆయనకు ఏమీ దక్కవని తెలిసి.. అధికార పార్టీలో చేరిపోయాడు! పార్టీలోకి వస్తే.. అందలమెక్కిస్తాం అని చెప్పడంతో ఆయన వెంటనే పార్టీ మారిపోయారు! పార్టీలో చేరి ఇన్ని రోజులైనా అసలు..ఆ హామీల ఊసు ఎత్తకపోవడంతో పాపం ఏం చేయాలో తెలియక ఆ ఎమ్మెల్యే తెగ తాగేస్తున్నారట!

ఇవి కూడా చదవండి:కట్టప్ప..బాహుబలిని చంపడంపై కేటీఆర్‌- రానా ట్వీట్ యుద్ధం

వివరాల్లోకి వెళ్తే , వైసిపి నుంచి టీడీపీలో చేరిన ఓ ఎమ్మెల్యే తాగుబోతయ్యారట! మంత్రి పదవి ఇస్తానని టీడీపీ మోసం చేయడంతో రాత్రనక - పగలనక తాగుతూనే ఉన్నారట! ఇంతకీ ఈ ఎమ్మెల్యే ఏ ప్రాంతానికి చెందినవారో మాత్రం ఆ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పలేదు. జగన్ జలదీక్ష వేదికపై నుంచి మాట్లాడిన చెవిరెడ్డి.. “వైసిపిలో ఉన్నప్పుడు రాత్రి పూట మాత్రమే ఆ ఎమ్మెల్యే తాగేవాడు. మంత్రి పదవి ఇస్తామని ఆశచూపడంతో టీడీపీలో చేరాడు. రోజులు గడుస్తున్నా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో 24 గంటలూ తాగుతూనే ఉన్నాడు“ అని చెవిరెడ్డి వివరించారు. తమ పార్టీ వీడిపోతే ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుందని చెవిరెడ్డి దీన్ని ఓ ఉదాహరణగా చెప్పారట. అయితే టీడీపీలో చేరిన అందరికీ మంత్రి పదవి ఇస్తామని ఆశచూపలేదు. ఇద్దరు లేక ముగ్గురికి ఈ హామీ ఇచ్చారు. ఈ ముగ్గురిలో చెవిరెడ్డి చెప్పిన తాగుబోతైన ఎమ్మెల్యే ఎవరబ్బా? ఆ ఎమ్మెల్యే రాయలసీమ ముఖద్వారమైన జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయి ఉండొచ్చని వైసిపి నేతలు ప్రైవేట్ మాటల్లో అంటున్నారట.

ఇవి కూడా చదవండి:ఆ పత్రికకు పంచ్ పడినట్లే....

English summary

Ysrcp Party Leader Chevireddy Bhaskar Reddy made some controversial comments on Jumping MLA's of Ysrcp. He said thart one of the MLA who jumped into TDP was Drinking Alcohol for not giving Minister Post to that MLA.