చంద్రబాబు 'డాక్టర్' అవుతున్నారు  - చికాగో వర్సిటీ 'గౌరవం'  

Chicago University Doctorate To ChandraBabu Naidu

11:38 AM ON 18th December, 2015 By Mirchi Vilas

Chicago University Doctorate To ChandraBabu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ కాబోతున్నారు. వైద్య విద్య అభ్యసించకుండానే ఈ అరుదైన గౌరవం దక్కుతోంది. అదేనండి గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత చికాగో విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఒక విదేశీ రాజకీయ నాయకుడికి గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం షికాగో యూనివర్శిటీ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం.

1890లో ఏర్పాటైన చికాగో యూనివర్శిటీ ఇంతవరకూ ఏ విదేశీ నేతకూ డాక్టరేట్ ఇవ్వలేదు. దార్శనికత, ఏపీని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న తీరు, ముందుచూపు, ప్రతిభ, కనబరుస్తున్న పరిపాలనా దక్షతకు గుర్తించి చంద్రబాబుకు డాక్టరేట్‌ ప్రకటించినట్టు షికాగో విశ్వవిద్యాలయం పేర్కొంది.

ఈ పురస్కారం అంగీకరించాలని కోరుతూ యూనివర్సిటీ రాసిన లేక్షను విశ్వవిద్యాలయ ప్రతినిధులు హైదరాబాద్ లో చంద్రబాబుకి అందజేశారు. ' విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ ఇస్తాం. అయితే మీకు అనుకూలమైన సమయంలో వచ్చి స్నాతకోపన్యాసం చేయాలి' అని ఆ ప్రతినిధులు కోరారు. స్నాత కొత్సవం రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల ఇంధన విభాగం సహకారంతో వాణిజ్య , వ్యాపార , పారిశ్రామిక , విద్యా రంగ ప్రముఖులతో ముఖాముఖి ఏర్పాటుచేయనున్నట్లు యూనివర్సిటీ ప్రెసిడెంట్ వేన్ వాట్సన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేండ ర్సన్ లు చంద్రబాబుకి ఆ లేఖలో తెల్పారు.

కాగా ప్రజల గుర్తింపే తనకు డాక్టరేట్ అని సిఎమ్ చంద్రబాబు పేర్కొంటూ , గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇవ్వజూపినా , సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన తెల్పారు. అయితే చికాగో యూనివర్సిటీకున్న చరిత్ర దృష్ట్యా ఇప్పుడు అంగీకరించాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.

English summary

Famous chicago university to respect Telugu Desam Party President and Cheif minister of Andhra pradesh Chandrababu Naidu by giving Doctorate to him.