నోట్ల యవ్వారంపై చిదంబర సంచలన వ్యాఖ్యలు (వీడియో)

Chidambaram Shocking Comments On Demonetization

11:22 AM ON 14th December, 2016 By Mirchi Vilas

Chidambaram Shocking Comments On Demonetization

చిదంబరం అనగానే కేంద్రమాజీ ఆర్ధిక మంత్రి గుర్తొస్తారు. పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుండడంతో ఈయన కూడా తీవ్రంగా సర్కార్ పై ధ్వజమెత్తారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిందని నాగపూర్ లో మీడియాతో మాట్లాడుతూ చిదంబరం అన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం ముందే లీక్ అయిందని ఆరోపించారు. పెద్ద మొత్తంలో 2వేల నోట్లు పట్టుబడటంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా నగదు రహిత లావాదేవీలు లేవన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికి ప్రయోజనమో చూస్తూనే ఉన్నాం. నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

English summary

Chidambaram Shocking Comments On Demonetization