వినాయకుని అవతారంలో చంద్రన్న

Chief Minister Chandrababu Naidu As Vinayakudu

02:39 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Chief Minister Chandrababu Naidu As Vinayakudu

పండగలన్నింట్లోకి చాలా స్పెషల్ గా ఉంటుంది వినాయక చవితి పండగ. వినాయకచవితి పండుగను సౌత్ టు నార్త్ వరకు అన్ని వర్గాలు, మతాలు, కులాల ప్రజలు తేడా లేకుండా భారీగా జరుపుకుంటారు. మండపాలు ఏర్పాటు చేసి, లైటింగులు పెట్టి, రకరకాల గణపయ్య విగ్రహాలు పెట్టి ఎవరికి తోచిన విధంగా వారు వైభవంగా గణేష ఉత్సవాలు జరుపుకుంటారు.

అయితే సామరస్య పూర్వకంగా జరుపుకోవాల్సిన గణేష ఉత్సవాలు ఇప్పుడు కాస్త కొత్త పుంతలు తొక్కాయి. ఎవరికి వారు పోటీ పడి మరి ఉత్సవాలు నిర్వహించాలని చూస్తూ, గణేష్ విగ్రహాల ఏర్పాటు లో సినీ , రాజకీయ నేతల ను తలపించే వినాయక ప్రతిమలు పెట్టేస్తున్నారు.

ఇప్పటి వరకు మనం బాహుబలి వినాయకుడని.. సర్దార్ గబ్బర్ సింగ్ వినాయకుడని.. తాజాగా వినాయక గ్యారేజ్ అంటూ జూనియర్ ఎన్ టి ఆర్ జనతా గ్యారేజిని పోలి వుండే విగ్రహాలు ఇప్పటికే సినీ అభిమానుల పిచ్చిని చూశాం. ఇక తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిక్స్ ప్యాక్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇక ఈ పిచ్చి రాజకీయాభిమానులకు కూడా విస్తరించింది. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు.

ఏపీలో చంద్రబాబుని విఘ్నావతారాన్ని తయారు చేసి మండపంలో కూర్చోబెట్టేశారు. మరోచోట మోడీ వినాయకుడు కూడా తయారయ్యాడు. ఇప్పటి వరకు సినీ అభిమానుల పైత్యానికే పరిమితమైన ఈ పిచ్చి ఇప్పుడు రాజకీయ అభిమానులకు కూడా పాకింది. అయితే దీనిపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినీ హీరోలను, రాజకీయ నాయకులను దేవుళ్లతో పోల్చి.. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న విమర్శలు పోటెత్తుతున్నాయి.

ఇది కూడా చూడండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: శివుడికి సోదరి ఉందని మీకు తెలుసా? ఆమె గురించి ఆసక్తికర కధ మీకోసం!

English summary

Chief Minister Chandrababu Naidu As lord Vinayakudu.