హింసకు పరాకాష్ట గా ఆ తల్లి

Child Abused By His Mother

01:48 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Child Abused By His Mother

దొరికిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన ఆ తల్లి ఎందుకో విరుద్ధంగా ప్రవర్తించింది. ప్రేమకు ప్రతిరూపంగా నిలవాల్సింది పోయి , చిత్ర హింసకు పరాకాష్ట ఏమిటో చూపింది, ఆ మహాతల్లి . నాలుగేళ్ల బాలుడికి ఓ తల్లి నిత్యం నరకం చూపిస్తున్న వైనం బయటపడింది.

ప్రకాశం జిల్లా చినగంజాం భాగ్యనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే , రెండేళ్ల క్రితం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో... భాగ్యనగర్‌కు చెందిన రమణ, కల్యాణి దంపతులకు శివ(4)అనే బాలుడు దొరికాడు. అప్పటి నుంచి వీరు బాలుడిని పెంచుకుంటున్నారు. అయితే ఆ బాలుడిని కల్యాణి తరుచూ కొడుతూ, హింసిస్తుండేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వాతలు పెట్టి, ఇంట్లో బంధించింది. బుధవారం ఉదయం రమణ, కల్యాణి దంపతులు చేపలు అమ్మడానికి బయటకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి ఇంట్లోంచి బయటకు రావడంతో స్థానికులు గమనించారు. పాల బుగ్గల చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్న విషయాన్ని ఛైల్డ్‌ లైన్‌ ప్రతినిధులకు చేరవేశారు. దీంతో గ్రామానికి చేరుకున్న ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధి .సాగర్‌ ఆ బాలుడిని చినగంజాం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ బాలుడుని బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు ఆయన వివరించారు. తల్లులూ మాతృత్వ గొప్పతనాన్ని నిర్వీర్యం చేయవద్దని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు.

English summary

A Mother beats severly her four year child named Shiva in Bhagya Nagar, Ongole District. That child was taken by Child Line and they were taking care of that child