ఇద్దరికీ పదిహేనేళ్ళు కూడా నిండలేదు.. కానీ వాళ్లకేం చేశారో తెలుసా?

Child marriages in Egypt

10:58 AM ON 26th October, 2016 By Mirchi Vilas

Child marriages in Egypt

ఒకప్పుడు మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. రాజారామ్ మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయుల పుణ్యామా అని బాల్యవివాహాలు చాలామటుకు తగ్గాయి. కానీ ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయంటే నమ్మగలరా? ఎక్కడో మారుమూల దేశంలో కాదు ఎంతో అభివృద్ధి సాధించిందని గొప్పగా చెప్పుకునే ఈజిప్ట్ లో... ఎక్కడైనా ఇలాంటి పెళ్లిళ్లు గోప్యంగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ జరిగిన ఈ వేడుక మాత్రం పూర్తి భిన్నం.

1/4 Pages

నార్త్ కైరోకి 75 మైళ్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో ఈ చిన్నారి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ సింగర్లతో గానాభజానా, బెల్లీ డ్యాన్సర్లతో తానాతందానా... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వేడుకలో చాలా విశేషాలే ఉన్నాయి. అయితే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, నిశ్చితార్థం చేసుకోవడం అంతకన్నా కాదు. కానీ పెళ్లంటే ఏంటో తెలియని వయసులో నిశ్చితార్థం చేయడం, అదీ ఇంత అట్టహాసంగా చేయడమే ఇక్కడ పలు విమర్శలకు తావిచ్చింది.

English summary

Child marriages in Egypt