ఇద్దరి హత్యకు దారితీసిన పిల్లల తగాదా

Children Fight Killed Two People In Visakha District

06:30 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Children Fight Killed Two People In Visakha District

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వచ్చిందనే సామెతను తలపించేలా ఉందీ ఘటన ... క్షణికావేశం కొంప ముంచింది. పిల్లల తగాదా ఇద్దరి హత్యకు దారితీసింది. ఈ దురదృష్టకర ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం చిముడుపల్లిలో చోటుచేసుకుంది. కొర్రా మత్సరాజు, కొర్రా కొత్తయ్యల కుమారులిద్దరూ ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకుని వినయ్ ఎందుకు కొట్టాడంటూ కొర్రా మత్సరాజు ఆవేశంతో కత్తితో దాడికి దిగాడు. దీంతో ఘటనా స్థలంలోనే కుర్రాడు తో వినయ్ ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వినయ్ తండ్రి కొత్తయ్య కోపంతో ఊగిపోతూ మత్సరాజుపై కర్రతో దాడి చేశాడు..అప్పటికి కొత్తయ్య కోపం తగ్గకపోవడంతో బలంగా కర్రతో బాదాడు..తీవ్ర గాయాలపాలై రక్తసావ్రంతో అక్కడికక్కడే మత్సరాజు చనిపోయాడు. మొత్తానికి ఇద్దరు కుర్రాళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ కుర్రాడు, ఓ తండ్రి హత్యకు కారణమైంది. దీంతో చిముడుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి: సెగలు పట్టిస్తున్నఊపిరి బ్యూటీ(ఫోటోలు)

ఇవి కూడా చదవండి:ఫేస్బుక్ ప్రియుడు కోసం పోలీసు భర్తనే చంపేసింది!

ఇవి కూడా చదవండి:ప్రభాస్ పెళ్ళి ఆమెతోనేనట

English summary

Small Children Fighting killed Two people in Chimudupalli in Vishaka District. This incident was shocked everyone there in that Village.