కనికరం లేని ఆయాలు.. చిన్నపిల్లల్ని కాల్చేస్తున్నారు..

Children physically assaulted by Sishu Vasathi Gruha workers

01:14 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Children physically assaulted by Sishu Vasathi Gruha workers

ప్రపంచంలో ఎక్కడైనా సరే చిన్నపిల్లల్ని దేవుళ్ళాగ చూస్తారు. కాని ఇక్కడ అమ్మలా చూసుకోవాల్సిన ఆయాలు.. రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నపిల్లలకి కాల్చి వాతలు పెడుతున్నారు. నిన్న మెదక్‌లో ఓ చిన్నారిని ఆమె తల్లిదండ్రులే చిత్రహింసలకు గురి చేసిన సంగతి మరువక ముందే.. నేడు ఆరుగురు చిన్నారులకు ఆయాలు నరకం చూపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ-నాన్న లేరనే కనికరం లేకుండా కాల్చి వాతలు పెట్టారు. కరీంనగర్‌లోని శిశు విహార్ వసతి గృహంలో జరిగిన ఈ దారుణం సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఆ కాలిన గాయాలతో చిన్నారులు ఎంతో నరకం అనుభవిస్తున్నారు.

ఆ చిన్నపిల్లలు ఎంత అరిచినా, మొత్తుకున్నా, ఏడ్చినా కానీ ఆ రాక్షస ఆయాలకు కనికరం కలగలేదు. పసిమొగ్గలు లాంటి ఆ చిన్నపిల్లల్ని చూస్తే కొట్టాలని ఎవరికి అనిపీదు, కానీ ఆ రాక్షస ఆయాలు మాత్రం ఎంతో కఠినంగా ప్రవర్తించారు. ఆ చిన్నారుల్లో తల్లిదండ్రులు లేనివారు కొందరైతే.. పట్టించుకోనివారు మరికొందరు. అంతా ఐదేళ్లలోపు చిన్నారులే! ఆ వసతి గృహమే అన్నీఅయినా ఈ చిన్నారులకు ఆయాల్లోనే అమ్మా-నాన్నలను చూసుకుంటున్నారు. చివరకు వాళ్లే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం అమానుషం. ఈ ఘటన పై ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు సదరు ఆయాల పై సస్పెన్షన్ వేటు వేసి వాళ్ళ తిక్క కుదిర్చారు.

English summary

Children physically assaulted by Sishu Vasathi Gruha workers. Kids physically assaulted and harrassed by Sishu Vasathi Griha workers in Karimnagar.