పనికి పంపాలనుకున్న నాన్న పై కేసు పెట్టిన చిన్నారులు

Children revolted on their father

12:03 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Children revolted on their father

అవును, తాము అనుకున్నది చేయడం కోసం ఆ ఇద్దరు పిల్లలు తండ్రికే ఝలక్ ఇచ్చారు. పని చేసుకుంటే నాలుగు డబ్బులొస్తాయని తండ్రి అంటే, చదువు కుంటే అన్ని విషయాలు తెలుస్తాయని ఆ చిన్నారులు వాదించారు. ఇలా తండ్రి వర్సెస్ పిల్లల మధ్య గొడవ కాస్త చివరకు ముదిరిపాకాన పడింది. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో నాన్న మీద ఏకంగా ఈ చిన్నారులు కేసు పెట్టారు.

వెస్ట్ గోదావరి జిల్లా తంగెళ్లమూడి కి చెందిన పాప షన్ను, బాబు సిద్ధుల తండ్రి ఆటోడ్రైవర్. ఎంత కష్టపడినా కుటుంబం గడవడం లేదన్నది తండ్రి వెర్షన్. కానీ తనకున్న వ్యసనాలతోనే సగం ఆదాయం వృధా అవుతోందన్న విషయం మర్చిపోయి పిల్లల్ని కూడా పనికి పంపాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్ కెళ్లి చదివి ప్రయోజకులం అవుతామని చిన్నారులు ఎంత చెప్పినా వినకపోగా నానాహింసలు పెడుతున్నాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటి నుంచి పారిపోయి కృష్ణాజిల్లాలో వీరవల్లిలోని అమ్మమ్మ ఇంటికొచ్చారు. అక్కడేవుండి చదువుకుంటున్నారు. ఐనా తండ్రి మళ్లీ వచ్చి, పిల్లల్ని పనికి వెళ్లాలంటూ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఎటూపాలుపోని ఆ చిన్నారులిద్దరు ఇక పోలీసులను ఆశ్రయించారు. పేరెంట్స్ని స్టేషన్కు పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ఇది కూడా చూడండి:నాగ చైతన్యకు చెంప చెళ్ళు మనిపించిదెవరు?

ఇది కూడా చూడండి:జెనిలీయాకి మళ్ళీ కొడుకే పుట్టాడు ..

ఇది కూడా చూడండి:అ..ఆ.. మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Children revolted on their father