చుక్కలు చూపించిన చింపాంజీ(వీడియో)

Chimpanzee Escapes From Zoo In Japan

12:25 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Chimpanzee Escapes From Zoo In Japan

జపాన్ లోని ఒక జూ లో బయటకు తప్పించుకున్న చింపాంజీ ఆ జూ సిబ్బందికి పట్టపగలే చుక్కలు చూపించింది. దాదాపు రెండు గంటలపాటు జూ సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించి , నానా తంటాలు పెట్టింది .ఇంతకి ఆ చింపాంజీ పేరేంటో తెలుసా చాచా , ఈ చింపాంజీ ఎలా తప్పించుకుందో గానీ ఒక్కసారిగా తన ఎన్ క్లోజర్ నుండి బయటకు వచ్చి విద్యుత్ స్తంభం ఎక్కేసింది .ఇలా విద్యుత్ స్తంభం ఎక్కిన చింపాంజీని కిందికి దించేందుకు జూ సిబ్బంది పడిన తంటాలు అన్ని ఇన్ని కావు .

ఇవి కూడా చదవండి: నడి రోడ్డు మీదే విషం తాగి చనిపోయిన హోంగార్డ్(వీడియో)

ఆ విద్యుత్ స్తంభం ఎక్కిన చింపాంజీ ని కిందికి దింపడానికి జూ సిబ్బంది మత్తుమందుతో కూడిన ఒక ఇంజక్షన్ ను దాని మీద ప్రయోగించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ చింపాంజీ కోపంతో వారి పై దాడికి కూడా యత్నించింది . విద్యుత్ తీగల ద్వారా పరుగు తీస్తూ తప్పించుకోబోయింది కానీ జూ సిబ్బంది మత్తు మందు ఇవ్వడంతో చివరకు ఆ విద్యుత్ తీగల పై నుండి సిబ్బంది సిద్ధంగా ఉంచిన వలలో పడిపోయింది. దీంతో ఆ చింపాంజీకి స్వల్ప గాయాలయ్యాయి . అసలు ఈ చింపాంజీ జూ నుండి ఎలా తప్పించుకుందో ఉద్యోగులను విచారించే పనిలో పడ్డారు జూ అధికారులు.

ఇవి కూడా చదవండి:

సుమ, అనసూయ నెల ఆదాయం ఎంతో తెలుసా

హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నందుకు మహిళను ఢీకొట్టిన ట్రైన్(వీడియో)

English summary

A Chimpanzee Named Cha Cha in Japan Escapes from Zoo and Climbed an Electric Poll .The name of that Chimpanzee was Cha Cha.