చెప్పుకోలేని సమస్య చైనా అబ్బాయిలను వేధిస్తోందట!

China boys are suffering for girls

11:42 AM ON 15th October, 2016 By Mirchi Vilas

China boys are suffering for girls

మన జనాభా కన్నా ఎక్కువ జనాభా చైనా సొంతం. ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం అది. అయితే అక్కడ అబ్బాయిలను ఓ సమస్య వేధిస్తోందట. ఎవరికీ చెప్పుకోలేరట. కొండ నాలుకకు మందేసుకుంటే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా చైనాలో అబ్బాయిలకు విచిత్రమైన సమస్య వచ్చి పడింది. చైనా జనాభా బాగా పెరిగిపోయారని, దీంతో జనాభా నియంత్రణ కోసం చైనా 'ఒన్ ఆర్ నన్' అనే పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానం వల్ల చైనాలోని ఆడవాళ్లకి ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ, మగవారికి మరీ ముఖ్యంగా అబ్బాయిలకు మాత్రం అమ్మాయిల సమస్య వచ్చి పడింది. ఒన్ ఆర్ నన్ విధానం సక్సెస్ అయినప్పటికీ, చైనాలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయిందట.

ఎంతగా అంటే ప్రతి 100 మంది ఆడవారికి 120 మంది మగవారు ఉన్నారట. దీంతో అబ్బాయిలు తాము పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లేదని తెగ బాధపడిపోతున్నారట. తమ దేశం వదిలి వధువుల కోసం పొరుగు దేశాలకు వరుస కడుతున్నారట. మన నిర్ణయం మనల్నే ముంచేసిందని ఇప్పుడు తెగ ఫీలయిపోతున్నారట. అతి ఎందులోనైనా ప్రమాదమేనని గుర్తిస్తే ఇలా జరిగేది కాదని అంటుకుంటున్నారట.

English summary

China boys are suffering for girls