చైనా జంట జపాన్ వెళ్లి... ఏం పని చేశారో తెలిస్తే షాకౌతారు!

China couple stolen a electronic toilet in Japan

12:19 PM ON 24th October, 2016 By Mirchi Vilas

China couple stolen a electronic toilet in Japan

చైనాకు చెందిన ఓ జంట జపాన్ వెళ్లి, అక్కడి హోటల్ లో బస చేసింది. అయితే అక్కడ చేసిన ఆ జంట నిర్వాకం చూసిన ప్రతి ఒక్కరు నివ్వెరపోతున్నారు. ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన లీ, అతని భార్య చెన్ ఇటీవల జపాన్ లోని నగోయ వెళ్లి అక్కడి స్టార్ హోటల్ లో బస చేశారు. వారు వస్తూవస్తూ వారి గదిలోని ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీటును దొంగతనంగా ఎత్తుకొచ్చారు. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. విషయం కాస్తా బయటపడి తమ పరువు కాస్తా బజారుకెక్కడంతో చైనాకు తిరిగొచ్చిన జంట తిరిగి ఆ టాయిలెట్ సీటును నగోయా హోటల్ కు పార్సిల్ చేసింది. చేసిన తప్పుకు జంట క్షమాపణలు వేడుకుంది.

చైనాలో ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం, అయినా అవి దొకకపోతుండడంతో జపాన్ వచ్చే చైనీయులు వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఈ జంట మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి బస చేసిన హోటల్ లోని టాయిలెట్ సీటును ఎత్తుకొచ్చేసింది. ప్రపంచానికి తెలిసిపోవడంతో నాలుక కరుచుని క్షమాపణలు కోరింది. మొత్తానికి చైనా పరువు పోయింది.

English summary

China couple stolen a electronic toilet in Japan