మావో విగ్రహాన్నిధ్వంసం చేసిన చైనా

China destroys Mao Zedong Statue

04:47 PM ON 9th January, 2016 By Mirchi Vilas

China destroys Mao Zedong Statue

చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌కు చెందిన భారీ ప్రతిమను చైనా ప్రభుత్వం ధ్వంసం చేసింది. దాదాపు 4.6 లక్షల డాలర్ల వ్యయంతో కాంక్రీట్‌, ఉక్కుతో బంగారు పూతతో హెనన్‌ ప్రావిన్స్‌లోని టాంగ్జు కౌంటీలో ఏర్పాటు చేసిన ఈ 37 మీటర్ల ప్రతిమకు ప్రభుత్వ అనుమతి లేనందునే కూల్చివేశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మావో సిద్ధాంతాలకు నానాటికీ ఆదరణ తగ్గిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు ఈ విగ్రహ ఏర్పాటుపై దేశ, విదేశాల్లో విస్తృత స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. మావో కూర్చున్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే.

English summary

A giant gold-painted statue of China's Communist Party founder Chairman Mao Zedong has been demolished, apparently for lacking government approval.