కొండ మీద గుట్టలకొద్దీ ఇళ్ళు.. చూస్తే అద్భుతమే(వీడియో)

China home to largest Buddhist settlement in the world

04:53 PM ON 26th October, 2016 By Mirchi Vilas

China home to largest Buddhist settlement in the world

ఒకటో రెండో మహా అయితే వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చూస్తాం. ఇక పేదల గృహాలైతే చిన్నచిన్నవి వేలల్లో కడతారు. కానీ కనిపించినంత మేరా చీమల పుట్టల్లా చిన్నచిన్న ఇళ్లు పడిపోతాయేమో.. అనిపించేలా కొండ చివర పచ్చిక బయళ్ల మధ్య నిర్మించిన బుల్లిబుల్లి చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. అవును, ఓ సినీకవి చెప్పినట్టు మేడంటే మేడా కదూ.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లూ మాది అని పాటేసుకోవాలనిపిస్తోంది కదూ ఈ ఇళ్లను చూస్తే! ఇక ఈ ఇళ్ళ సముదాయం ఉన్న ప్రాంతం లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీ. వాయువ్య చైనాలో పర్వత ప్రాంతంలో వున్న లారంగ్ గార్ బౌద్ధ అకాడమీ ప్రపంచం మొత్తమ్మీద అతి పెద్దదైన ఈ టిబెటన్ బౌద్ధారామంలో పదివేల మందికిపైగా బౌద్ధ సన్యాసులు, సాధువులు నివశిస్తుంటారు.

చూడ్డానికి కళ్లకు అందంగా కనిపిస్తున్నా, వాళ్లంతా ఇరుకైన చిన్న ఇళ్లల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అరకొర సౌకర్యాలతో కొండవాలు ప్రాంతాల్లో వుంటారు. గుంపులు గుంపులుగా ఎరుపు రంగులో కనిపించే ఇళ్ళన్నీ అక్కడి బౌద్ధ అకాడమీకి చెందిన వాళ్లవే! అక్కడకొచ్చి సెటిలయిన వాళ్లవే..

భూమికి 12,500 అడుగుల ఎత్తులో రఫ్ వాతావరణంలో నిర్మానుష్య ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు నివాసముంటుంటారు. వీళ్ళ ఇళ్లన్నీ ఎరుపురంగులో ఉండి ఇరుకుగా ఒకదాని వెంట మరొకటి ఉండటంతో కొండ మీద రెడ్ సీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చీమల దండుగా ఉన్న ఈ ఇళ్లపై మీరు ఓ లుక్కెయ్యండి.

వీడియో:

English summary

China home to largest Buddhist settlement in the world