షాకింగ్ న్యూస్: కుక్కల ద్వారా ఇండియాకి వైరస్ పంపుతున్న చైనా!

China sending virus through the dogs to India

02:14 PM ON 4th October, 2016 By Mirchi Vilas

China sending virus through the dogs to India

జరిగిందే సినిమాల్లో తీస్తారు, ఇక సినిమాలో జరిగినట్టే కొంతమంది చేస్తారు. ఇదంతా ఎందుకంటే, 2011లో విడుదలైన సెవెంత్ సెన్స్ మూవీ తెలుసు కదా. అందులో సూర్య హీరోగా చేశాడు. ఆ మూవీలో చైనా బయోవార్ తో ఇండియాను తన చేతుల్లో పెట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. 6వ శతాబ్ధంలో వచ్చిన ఒక వైరస్ ని మళ్లీ నిద్రలేపి ఇండియాని రోగాల పాలు చేసి ఇబ్బందుల్లోకి నెట్టాలని నిర్ణయించుకుంటుంది. దీని కోసం ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిని ఇండియాకు పంపుతుంది. అతడు ఇండియాకు వచ్చి వీధి కుక్కలకు ఒక వైరస్ ఇంజెక్ట్ చేయడం, దీంతో దేశం మొత్తం వైరస్ వ్యాపిస్తే ఆ వ్యాక్సిన్ ను చైనా చెప్పిన ధరకు ఇండియా కొనేలా చేయడం. తద్వారా చైనా భారత్ ను తన ఆధీనంలో ఉంచుకోవడం. ఇదీ సినిమా సారాంశం.

అయితే తాజాగా చైనా నుంచి వచ్చిన ఒక కంటైనర్ లో రెండు కుక్క పిల్లలు దిగుమతి కావడంతో అలాంటి కలకలాన్నే సృష్టిస్తున్నాయి. చైనా నుంచి ఆ రెండు కుక్క పిల్లలను కావాలనే పంపించారో/అనుకోకుండా పొరపాటున వచ్చాయో తెలియదు గాని మొత్తం మీద కలకలం సృష్టించాయి. చెన్నైలోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ లో ఒక మొబైల్ సంస్థ ఉంది. ఈ సంస్థకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ కంటైననర్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న కంటైనర్లో రెండు కుక్కపిల్లలు ఉండడంతో ఈ విషయాన్ని గుర్తించిన హార్బర్ సిబ్బంది బ్లూక్రాస్ కు సమాచారం అందించారు.

దీంతో వైద్యులతో అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు.ఈ కుక్క పిల్లల్లో వైరస్ ను ఆదేశస్తులు పంపించారేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్టు టాక్.

ఇది కూడా చదవండి: స్లిమ్ గా ఉండేవాళ్ళు.. రోజూ అది మానరట!

ఇది కూడా చదవండి: బావే కదా అని ఇంట్లో చోటిస్తే రేప్ చేసాడు.. ఇది చూసి మరో ఇద్దరు కూడా..

ఇది కూడా చదవండి: గర్భం పొందిన తరువాత మహిళలు అసలు తినకూడని ఆహారం!

English summary

China sending virus through the dogs to India. China sending virus through dogs.