దొంగల చేతుల్లో చైనా వాల్.. వారసత్వ సంపద అదృశ్యం!

China wall bricks was theft by thiefs

10:45 AM ON 30th July, 2016 By Mirchi Vilas

China wall bricks was theft by thiefs

ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా వున్న చైనా వాల్, క్రీస్తు పూర్వం మూడో శతాబ్ధం నుంచి మింగ్ రాజులు(1368-1644) పరిపాలించిన కాలం వరకు దశదశలుగా నిర్మించారు. అయితే, ఈ గోడ ఇప్పుడు రోజురోజుకూ కనుమరుగైపోతోందట. ఎలాగంటారా? ఈ వాల్ ను దొంగలు దోచుకుంటున్నారట. వివరాల్లోకి వెళదాం. చైనా గోడ నిర్మాణం కోసం వినియోగించిన రాళ్ళు, ఇటుకలను దొంగలు ఒక్కొక్కటిగా చోరీ చేస్తున్నారట. ఈ కారణంగా ఈ వాల్ అదృశ్యమైపోతోందట. ఫలితంగా దాదాపు 21 వేల కిలోమీటర్ల పొడుగు ఉండే గోడ ఇప్పుడు శిథిలంగా మారుతోంది. రాళ్లు, ఇటుకలు ఎత్తుకెళ్లుతున్న దొంగలను పట్టుకునేందుకు చైనా ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలను తీసుకున్నప్పటికీ, ఫలితం కనిపించడం లేదు.

ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం కోసం చైనా వాల్ ఇటుకలను దొంగలిస్తున్నారు. విదేశీ పర్యాటకులకు అమ్మేందుకు కూడా ఆ ఇటుకలను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వానలు, బలమైన గాలులు వల్ల సహజసిద్ధంగానే చైనా గోడ కొంత శిథిలావస్థకు చేరుకుంది. దీనికితోడు దొంగలవల్ల కూడా ప్రపంచ వారసత్వ సంపదకు ముప్పు వాటిల్లుతోంది. వారసత్వ సంపద కాపాడుకోకపోతే జాతి మనుగడ ఉండదని అంటారు కదా, అందుకే పరిరక్షించాలని డిమాండ్ వస్తోంది.

English summary

China wall bricks was theft by thiefs