అగ్ర రాజ్య నేతకు షాకిచ్చిన చైనా

China Welcomes Obama In A Less Graceful Way

10:39 AM ON 6th September, 2016 By Mirchi Vilas

China Welcomes Obama In A Less Graceful Way

ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచానికే పెద్దన్న ఎవరని అడిగితే, అమెరికా అధ్యక్షుడని ఠక్కున చెప్పేస్తాం. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశానికెళ్లినా.. రాజువెడలె రవితేజములలరగ అన్నట్టు రెడ్ కార్పెట్ స్వాగతాలే ఉంటాయి. అయితే, ఎర్ర చైనాలో అమెరికా అధ్యక్షుడి పప్పులుడకలేదు. రెడ్ కార్పెట్ మాట దేవుడెరుగు.. ఆయన ఎక్కి వచ్చిన విమానానికి స్టెయిర్ కేస్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విమానానికే ఉన్న మెట్ల ద్వారా ప్రత్యామ్నాయమార్గంలో ఒబామా దిగాల్సి వచ్చింది.

జీ-20 సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా వచ్చిన ప్రెసిడెంట్ ఒబామాకు, అక్కడి హాంగ్ ఝౌ విమానాశ్రయంలో చైనా షాక్ ఇచ్చింది. అంతేకాదు, ఒబామాతోపాటు వచ్చిన పాత్రికేయుల బృందం ఆయన సమీపంలో ఉండటానికి కూడా చైనా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఒబామా సిబ్బంది ఆగ్రహోదగ్రులైపోయారు. మా నాయకుడి కోసం మేమే రూల్స్ పెడతాం అని వైట్ హౌస్ అధికారి ఒకరు చైనా అధికారితో అంటే, ఆ చైనా అధికారి అంతకంటే గట్టిగా.. ఇది మా దేశం.. మా ఎయిర్ పోర్ట్ అని సమాధానమిచ్చారు.

కాబట్టి ఇక్కడ రూల్స్ మేమే నిర్ణయిస్తాం అని చెప్పకనే గట్టిగా తెగేసి చెప్పారు. దీంతో బిత్తరపోవడం వైట్ హౌస్ అధికారి వంతు అయింది. రగడ అక్కడితో ముగియలేదు. జాతీయ భద్రత సలహాదారు సుసాన్ రైస్ ను ఒబామాకు దూరంగా ఉంచడానికి ఒక చైనీస్ అధికారి ప్రయత్నించారు. వీటి గురించి ఒక విలేకరి ప్రశ్నిస్తే, వారు ఊహించని విధంగా ప్రవర్తించారు అంటూ ఆమె సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి:సమంత రెండేళ్ల క్రితమే కోడలిగా ఫిక్స్ అయిందా?

ఇవి కూడా చదవండి:రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Recently American President Obama visited china and the officials in China welcomes Obama in a less graceful way. One of the White House Official said that they will keep rules, then china official said that was their country not America.