అమరావతిలో చైనా మంత్రి పర్యటన

China's Vice Minister Visit to Amaravathi

01:15 PM ON 20th November, 2015 By Mirchi Vilas

China's Vice Minister Visit to Amaravathi

చైనా వైస్‌ మినిష్టర్‌ చెన ఫింగ్స్‌యాంగ్‌ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ నెల 23 వ తేదీన ఆయన విజయవాడ చేరుకుంటారు. రెండు రోజులపాటు పర్యటిస్తారు. ఇందుకు సంబంధించిన విశేషాలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు వెల్లడించారు. చెన ఫింగ్స్‌యాంగ్ అమరావతి పర్యటన సందర్భంగా ఈ నెల 23 న విజయవాడ నగరంలోలోని హోటల్‌ గేట్‌వేకు చేరుకుంటారు. ఆయన పర్యటన వివరాలు ఇలా వున్నాయి.
ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం విమానంలో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీఏడీ ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌లు స్వాగతం పలుకుతారు. ఉదయం గం.9లకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రత్యేక ఫైలెట్లు, ఎస్కార్ట్‌లతో గం.9.20లకు హోటల్‌ గేట్‌వేకు చేరుకుంటారు. గం.9.30ల నుంచి గం.10.20ల వరకు హోటల్‌ గేట్‌వేలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో అల్పాహార విందులో పాల్గొంటారు. గం.10.20లకు హోటల్‌ నుంచి బయలుదేరి గం.10.30లకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు. గం.10.30ల నుండి గం.10.45ల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు. గం.10.45ల నుంచి మధ్యాహ్నం గం.12ల వరకు ిసీఎం నేతృత్వంలో మంత్రులు, సీనియర్‌ అధికారులతో సమావేశం అవుతారు. గం.12లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయలుదేరి గం.12.15లకు హోటల్‌ గేట్‌వేకు చేరుకుంటారు. గం.12.15ల నుంచి గం.1ల వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలుస్తారు. గం.1ల నుంచి గం.2.15ల వరకు సీఎం ఇచ్చే విందులో పాల్గొంటారు. గం.2.15ల నుంచి గం.3ల వరకు విరామం. మధ్యాహ్నం గం.3లకు రోడ్డు మార్గాన అమరావతి వెళతారు. సాయంత్రం గం.5.30లకు అమరావతి నుంచి బయలుదేరి గం.6లకుహోటల్‌కు చేరుకుంటారు. గం.6ల నుంచి గం.6.50ల వరకు విరామం. గం.6.50ల నుంచి గం.9ల వరకు సిఎం ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి గం.9లకు ిసీఎం చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరి గం.9.30లకు గేట్‌వే హోటల్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 24వ తేదీ ఉదయం గం.7.30ల నుంచి గం.8.15 వరకు అల్పాహారం... ఆ తర్వాత హోటల్‌ నుంచి బయలుదేరి ఢిల్లీకి పయనమవుతారు. చైనా మంత్రి పర్యటన నేపధ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

English summary

China's Vice Minister Visit to Amaravathi