ఈ పింగాణి  పాత్ర చాలా కాస్టు గురూ..!

Chineese Porcelain Vase Shocks Everyone

08:12 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Chineese Porcelain Vase Shocks Everyone

ఎందుకుపనికి రాదని పక్కన పడేసే పాత సామానులకు కూడా కోట్ల రూపాయలు ఉంటాయని ఎవరు ఊహించగలరు చెప్పండి. కానీ పురాతన వస్తువులకు మాత్రం ప్రపంచ మార్కెట్లో ఉండే గిరాకీ మాత్రం అంతా ఇంతా కాదు. కోట్లకు కోట్లు పలికే ఎన్నో వస్తువులను వేలం వేసినట్లుగా వార్తలు విని ఔరా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే లండన్ లోని వేల్స్ లో జరిగింది. అక్కడి ప్రముఖ వేలం సంస్థ వారు 19 సెంటిమీటర్ల తో కేవలం 150 పౌండ్ల విలువున్న ఒక చైనీస్ పింగాణీ పాత్రను ఆన్ లైన్ లో 500 పౌండ్ల కు వేలానికి పెట్టగా అది ఏకంగా 114,500 పౌండ్లకు అమ్ముడై అందరిని ఆశ్చర్య పరచింది. అంటే మన కరెన్సీలో అక్షరాలా కోటీ పదమూడు లక్షల రూపాయలు అన్నమాట. ఇది దాని అసలు విలువ కన్నా 700 రెట్లు ఎక్కువన్న మాట. ఈ స్థాయిలో ఆ పింగాణి పాత్ర వేలానికి అమ్ముడుపోతుందని ఆ వేలం సంస్థ కూడా ఊహించకపోవడం విశేషం.

ఏనుగు తల ఆకారంలో హ్యాండిల్స్ ఉండడం ఈ పాత్ర ప్రత్యేకత .లండన్ లోని " చైనీస్ సిరామిక్స్ అండ్ వర్క్స్ అఫ్ ఆర్ట్ " వారు తయారు చేసిన కొన్ని వేల చైనీస్ పాత్రల లో ఇది కూడా ఒకటి.దీన్ని వేలం వేసిన నైజల్ హడ్సన్ మాట్లాడుతూ ఇంత వరకు తను అమ్మిన వాటిలో ఇదే అత్యంత ధర పలికిన వస్తువని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

English summary

Chineese Porcelain Vase Shocks Everyone