చంద్రుడిపై చైనా ప్యాలెస్

Chinese Rover Lands On Moon

05:09 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Chinese Rover Lands On Moon

చైనా.. ఎక్కడైనా ఏమైనా చేయగలదు. ఇప్పుడు ఏకంగా చంద్రుడిపై ఓ ప్యాలెస్ కట్టేసింది. ఏంటి ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా. నిజమే.. చంద్రుడి మీదకు చైనా తొలిసారి పంపిన అంతరిక్షనౌక చాంగ్‌ఈ3 ల్యాండింగ్ అయిన ప్రదేశానికి గాంగ్ హాన్ గోంగ్, మూన్ ప్యాలెస్ అని పేరుపెట్టింది. ఈ అంతరిక్షనౌక రెండేండ్ల తర్వాత 2013 డిసెంబర్‌లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రుడిపై ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న మూడు బిలాలను, ఆ ప్రదేశం పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (ఐఏయూ) ఆమోదించిందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్(ఎస్‌ఏఎస్టీఐఎన్‌డీ) తెలిపింది. చైనా పురాణాల ప్రకారం చాంగ్‌ఈ అంటే చంద్రుడి దేవత అని, గాంగ్ హాన్ గోంగ్ అంటే రాజభవనం అని అర్థం. ఈ భవనం చాంగ్‌ఈ, యూటూకు రాజప్రసాదాల్లాంటివని చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ ప్రదేశం 154 మీటర్ల వ్యాసార్థంతో 44.12 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 19.51 డిగ్రీల పశ్చిమ రేఖాంశంపై ఉందని పరిశోధకులు వెల్లడించారు. మూడు బిలాలకు జీ వీ, తియాన్ షీ, తాయ్ వీ అనే పేర్లను ఖరారు చేశారు.

English summary

In 2013 china launched a rover and now after two long years that cvhineese rover lands on moon sucessfully.It discovers lava-filled impact basins