మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

Chinese Volleyball Player Gives Birth During Match

09:38 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Chinese Volleyball Player Gives Birth During Match

అవునా, అని ఆశ్చర్య పోకండి ... నిజం ... అరుదైన , ఆసక్తి కరమైన ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, చైనాలోని చాంగ్స్‌కింగ్ నగరంలో అండర్ 18 వాలీబాల్ చాంపియన్‌షిప్‌ గత బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. టీవీల్లో అందరూ ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఉత్కంఠ పోరు ... ఇంతలోనే ఓ అద్భుతం ఆవిష్కృత మైంది. ఇందులో ఓ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఆమె గర్భవతి కావడంతో మ్యాచ్‌లో పాల్గొనలేదు. కానీ, అక్కడ జరుగుతున్న మ్యాచ్‌ను రికార్డ్ చేస్తోంది. అయితే ఓ పక్క మ్యాచ్ సాగుతుంటే, ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులొచ్చాయి. దీంతో ఆమె హడావుడిగా జిమ్ టాయిలెట్ వైపు పరుగులు తీసింది. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ దగ్గరలో ఉన్న పొదల్లో పసికందును పడేసి తిరిగి ఏమీ తెలియనట్టుగా మ్యాచ్‌ను రికార్డ్ చేసింది. అయితే టాయిలెట్ వైపుగా వెళ్లిన ఓ వ్యక్తి రక్తపు మడుగులను అనుసరిస్తూ వెళ్లాడు. తీరా చూస్తే ఆమె మ్యాచ్‌ను రికార్డ్ చేస్తూ కనిపించింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చైనాలో పెళ్లి కాకుండా బిడ్డను కంటే నేరంగా పరిగణిస్తారు. వారు సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో అనేక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆ యువతి ఏమీ తెలియనట్టు ప్రవర్తించిందని అంటున్నారు. అయితే, తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

నవదీప్‌ కి మండింది - ట్విట్ట ర్ లో రెచ్చిపోయాడు

చిన్న వయస్సులోనే చనిపోయిన హీరోయిన్స్‌

శ్రీజ ఫంక్షన్ కి పవన్ కావాలనే రాలేదా?

సన్నీ మళ్లీ రెచ్చిపోయింది.. ఈసారి మరీ వేడి పుట్టిస్తుంది

English summary

A Chinese teen Volley Ball Player gives birth during volleyball game and leaves that baby in near by bushes .This weird incident was occurred in China.