నల్ల వాళ్ళను తెల్లగా ఇలా మారుస్తారట

Chinese Washing Detergent Advertisement Goes Viral

12:26 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Chinese Washing Detergent Advertisement Goes Viral

కొన్ని కొన్ని కంపెనీలు తమ ఉత్పతులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్తగా అనేక రకాలైన ప్రచార వీడియోలను ప్రచారం చేస్తుంటారు. కాని ఒక్కోసారి ఆ ప్రచార వీడియోలలో అతి చేస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా అలాంటి అనుభవమే చైనాలోని ఒక లాండ్రీ డిటర్జెంట్ కంపెనీకి ఎదురయ్యింది. జాతి అహంకారానికి ప్రతీకగా ఉన్న ఈ వాణిజ్య ప్రకటన పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే చైనాలోని కియోబీ అనే ఒక లాండ్రీ డిటర్జెంట్ పౌడర్ కంపెనీ తమ బ్రాండ్ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఒక చైనా యువతి బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్తుంటే ఒక నల్ల జాతీయుడు ఆమెను చూసి కన్ను కొడతాడు . అతన్ని చూసి ఆమె నవ్వుతు దగ్గరకి రమ్మని పిలుస్తుంది . తనకు ముద్దు ఇవ్వడానికి పిలుస్తుందేమో అని ఆమె వద్దకు వెళ్ళిన అతడికి నోట్లో చాక్లేట్ పెట్టి వాషింగ్ మెషిన్ లోకి బలవంతంగా తోసేసి వాషింగ్ మెషిన్ పై కూర్చుంటుంది .

అలా వాషింగ్ మెషిన్ పై కూర్చున్న ఆ చైనా యువతి కొద్దిసేపటి తరువాత ఆ వాషింగ్ మెషిన్ మూత తీసి చుస్తే ఆ నల్ల జాతి యువకుడు కాస్తా ఒక తెల్లటి చైనా యువకుడి లాగా తెల్లగా మారిపోయి బయటకి వస్తాడు. ఇలా ఒక జాతి వారిని తక్కువ చేసి చూపించడంతో ఈ ప్రకటన పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రకటన కొన్ని చిఎన్మా ధియేటర్లలో సైతం ప్రచారం కావడంతో ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్ లో సంచలనంగా మారింది. ఆఫ్రికా జాతికి చెందిన వాళ్ళను అవమానపరిచే విధంగా ఈ ప్రకటనను ఎలా ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు . ఈ ప్రకటన చూస్తే నల్ల జాతీయుల పై చైనా చూపుతున్న జాతివివక్ష ఎంతటి రేంజ్ లో ఉందొ యిట్టె అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి:బికినీలో రెచ్చిపోయిన 'ఈడో రకం ఆడో రకం' హీరోయిన్(ఫోటోలు)

ఇవి కూడా చదవండి:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ !

English summary

A Chinese detergent powder advertisement in china was going viral over the social media and internet and in this advertisement an African man will try to grab intention of a Chinese girl and she throws him into a washing machine and later he will become white a become a white china man.