చిన్నారి పెళ్లికూతురు ఇక సమాప్తం

Chinnari Pellikuthuru serial coming to end

12:55 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Chinnari Pellikuthuru serial coming to end

మా టీవీలో ప్రసారమయ్యే 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇందులో నటించిన చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ తెలుగులో హీరోయిన్ కూడా అయిపోయింది. అయితే ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సీరియల్ ఇక సమాప్తం కాబోతుందట. అవును కాస్త బాధగా ఉన్నా ఇది నిజం. ఆ వివరాల్లోకి వెళితే.. దేశ టెలివిజన్ రంగంలో సంచలనం రేపిన సూపర్ హిట్ సీరియల్ 'బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)' త్వరలో ఆగిపోనుందట. ఎప్పుడో 2008లో ప్రారంభమైన ఈ సీరియల్ తొమ్మిదేళ్లుగా టీవీలో ప్రసారమవుతూనే ఉంది.

దేశంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా 'బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)' రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సీరియల్ హిందీ వెర్షన్ జూలై 31తో సమాప్తం కానున్నట్టు సమాచారం. చిన్నతనంలో పెళ్లి చేయడంతో ఒక అమ్మాయి ఎదుర్కొన్నకష్టాల ఆధారంగా ఈ సీరియల్ ను రూపొందించారు. మాటీవీలో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో ఈ సీరియల్ టీవీల్లో ప్రసారమవుతోంది. నిర్మాతలకు కాసులు కురిపించిన ఈ సీరియల్ దేశంలో పలు భాషల్లోకి అనువాదమై ప్రసారమవుతోంది. ఇందులో నటించిన నటీనటులు కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.

English summary

Chinnari Pellikuthuru serial coming to end