మెగాస్టార్ 150వ మూవీ జిరాక్స్ కాపీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్నికృష్ణ

Chinni Krishna sensational comments about Chiranjeevi 150th movie

10:29 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Chinni Krishna sensational comments about Chiranjeevi 150th movie

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ సినిమాలో ఎంటర్ అవుతూ ప్రతిష్ఠాత్మకంగా 150వ సినిమా పెట్టుకుంటే, దీనిపై ఇండస్ట్రీలోనే పెదవి విరుపు మొదలైంది. మొన్నటికి మొన్న దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి స్పందిస్తూ, చిరంజీవి సందేశం ఇస్తూ సినిమా తీస్తే ఫలితం ఉండదని అనేసారు. ఇప్పుడు రచయిత చిన్నికృష్ణ అదో రకమైన నిరాశ వ్యక్తం చేశాడు. ఓ తమిళ రీమేక్ ను ఎంచుకోవడం పట్ల చిన్నికృష్ణ స్పందించాడు. ఒకప్పుడు నరసింహా, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి.. ఇప్పుడు ఖాళీ అయిపోయారేంటి అని అడిగితే.. తనదైన శైలిలో చిన్నికృష్ణ స్పందిస్తూ, చిరు 150 కోసం తనను కథ అడిగారని.. అయితే తాను రాసిన కథను కాదని కత్తి రీమేక్ ను చిరు ఎంచుకున్నాడని అన్నాడు.

తాను మూడేళ్ల పాటు కష్టపడి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోసం ఓ స్క్రిప్టు రాసినట్లు కూడా అతను చెప్పాడు. అవకాశాలు రాకేం కాదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులొస్తూనే ఉన్నాయి. చిరంజీవి గారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరినట్లే ఓ భారీ కథ తయారు చేశాను. నేను చెప్పిన పాయింట్ ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. అయితే చిరంజీవి గారికి నా కథ కంటే 'కత్తి' బాగుందనుకున్నారు. ఆ సినిమానే చేయాలనుకున్నారు. ఇక గత కొన్నేళ్లుగా నేనేమీ ఖాళీగా లేను. అమీర్ ఖాన్ గారితో చేయాలన్నది నా జీవితాశయం.

'జీనియస్' తర్వాత ఆయన కోసం స్క్రిప్టు రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. గత ఏడాదే పని పూర్తయింది. హిందీ వాళ్లతో డైలాగులు కూడా రాయించాను. వచ్చే నెలలోనే అమీర్ ఖాన్ కు సబ్మిట్ చేస్తా అని చెప్పాడు చిన్నికృష్ణ. ఇంతకీ వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి.. బాలయ్య మధ్య పోటీ జరగబోతోంది కదా.. దాని గురించి మీ అభిప్రాయమేంటి అని అడిగితే.. చిరంజీవి గారు చేస్తున్నది రీమేక్. ఆల్ మోస్ట్ జిరాక్స్ కాపీ లాంటిది. ఇక బాలయ్యది చరిత్ర గురించి చెప్పే సినిమా. రెండూ స్ట్రెయిట్ సినిమాలైతే మాట్లాడొచ్చు, పోల్చవచ్చు. కాబట్టి దీని గురించి చెప్పేదేమీ లేదు అంటూ చిన్నికృష్ణ తెలివిగా తప్పించుకున్నాడు.

English summary

Chinni Krishna sensational comments about Chiranjeevi 150th movie