కమ్యూనిస్టులూ కాంగ్రెస్ తో కల్సి పోండన్న చింతా

Chinta Mohan Controversial Comments

01:04 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Chinta Mohan Controversial Comments

కాంగ్రెస్ నాయకులు ఖాళీగా వున్నారు. కొంతమంది పార్టీని ఎలా బతికించాలో తెలియక నానా అవస్థలు పడుతుంటే, రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే , తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మాత్రం అబ్బుర పరిచే మాటలతో వార్తలకు ఎక్కుతున్నారు. ఈయన ఎప్పుడు ఏది చేసినా ఒక సంచలనమే అన్నట్లు వ్యవహారం వుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన స్టెలే వేరు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న చింతామోహన్‌ ప్రస్తుతం ఆ పార్టీని బతికించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట. వ్యూహాలు పన్నుతున్నారట. గత కొన్నిరోజులకు ముందు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న చింతామోహన్‌ కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పునర్‌ వైభవం రావాలంటే ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌తోనూ, జగన్‌తోనూ, లేకుంటే ఇతర నాయకుడితోను కలిసి తీరాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్‌ నాయకుల ఆగ్రహావేశాలతో ఉన్నా చింతామోహన్‌ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడమే.

ఇవి కూడా చదవండి:ఆటోలోనే గ్యాంగ్ రేప్

అయితే తాజాగా చింతామోహన్‌ మరో సంచలన ప్రకటన చేశారు.దేశంలో పెరిగిపోతున్న మతతత్వశక్తుల అణచివేతకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసిపోయి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కమ్యూనిస్టులు తమతో కలిసిపోవాలని కూడా సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ శత జయంతి సభకు హాజరైన చింతామోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చింతామోహన్‌ చేసిన వ్యాఖ్యలు విన్న కమ్యూనిస్టులు ముక్కున వేలేసుకున్నారు. కమ్యూనిస్టులు ఏ రాజకీయ పార్టీలతో కలవరు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయడంతో కమ్యూనిస్టులది మొదటి పాత్ర. ఈ విషయం చింతామోహన్‌కు తెలుసు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీని ఎలాగోలా గట్టెంక్కించి పునర్‌ వైభవం తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దీంతో ఆయన ఏ సమావేశానికి వెళ్ళినా తనతో పాటు ఉన్న పార్టీ నాయకులను కలుపుకుని పోయేందుకే ప్రయత్నిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:దత్తపుత్రిక ప్రేమ వ్యవహారంలో కేసీఆర్ ఏం చేస్తారో?

ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌, జగన్‌తో కలుద్దామన్న చింతామోహన్‌ ప్రస్తుతం కమ్యూనిస్టులతో కలుద్దామని చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. దీన్ని బట్టి చూస్తే చింతామోహన్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఏదో ఒక పార్టీని కలపడమో, అడివీలుకాకపోతే కాంగ్రెస్‌ పార్టీనే కలిపేయడమో చేసేంత వరకు నిద్రపోయేటట్లు కనిపించడం లేదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కాకపొతే చింతామోహన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై అధిష్టానం ఏ విధంగానూ స్పందించకపోవడం వింతగా వుంది.

ఇవి కూడా చదవండి:

ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని హర్ట్‌ చేసిన పవన్‌

English summary

Chitoor District Congress Party Ex-Mp Chinta Mohan says that Congress party have to merge other party or Congress party have to Merge in other party.