చిత్తూరు  కోర్టులో లొంగిపోయిన చింటూ 

Chintu Surrenders In Chittoor Court

12:20 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Chintu Surrenders In Chittoor Court

చిత్తూరు మేయర్ అనూరాధ - మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చంద్రశేఖర్ అలియాస్ చింటూ చిత్తూరు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం లొంగిపోయాడు. చిత్తూరు మేయర్ కటారి అనూరాధ - మోహన్ దంపతుల ను నవంబర్ 17న దారుణంగా హత్యచేసిన ఘటనలో మోహన్ మేనల్లుడైన చింటూ ప్రధాన నిందితుడని తెల్సిన సంగతి తెల్సిందే. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే పట్టపగలు ముగ్గురు వ్యక్తులు దాడిచేసి , మేయర్ని తుపాకితో కాల్చడం , ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ,ప్రాణాలు కోల్పోగా , వెంటనే ఆమె భర్త మోహన్ పై కూడా కత్తులతో తుపాకితో దాడి చేయడంతో ఆసుపత్రికి చేర్చారు. చివరకు మోహన్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈఘటన లో ముగ్గురు నిందితులు పోలీసు స్టేషన్ లో వెంటనే లొంగిపోవడంతో , రిమాండ్ కి పంపారు. ఈకేసుని సీరియస్ గా తీసుకుని పగద్బందీగా దర్పాప్టు మొదలుపెట్టారు. పోలీసు జాగిలాలు చింటూ ఇంటివైపు వెళ్ళడంతో అతనే ప్రధాన నిందితుడని భావించారు. దీనికి తోడూ హత్య జరిగాక చింటూ పరారయ్యాడు. దీంతో చింటూ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేసారు. దేశం విడిచి పోకుండా ఉండేలా ముందస్తుగా హైదరాబాద్ , ముంబై , చెన్నై యియిర్ పోర్టులకు పోలీసులు లేఖలు రాసారు. తమిళనాడు , మహారాష్ట్ర లలో కూడా చింటూ కోసం సోదాలు చేసారు. అతనికి చెందిన కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసారు.

ఇదిలా వుంటే గత రెండు రోజులుగా చింటూ పేరిట మీడియాకు లేఖలు అందాయి. తాను నిర్దోషినని, తనకు హత్యతో సంబంధం లేదని , తనకు పోలీసుల వలన ప్రాణహాని వుందని చింటూ ఆ లేఖలో చింటూ పేర్కొన్నాడు. తాను లొంగిపోవడానికి సిద్ధమని పేర్కొన్నాడు. ఈ దశలో మరో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకుని మురుగ , పరంధామ, హరిదాసు పోలీసులకు దొరికిపోవడంతో వీరిని , మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు చింటూ నాటకీయంగా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు హుటాహుటీన కోర్టు కి చేరుకున్నారు. మీడియా కూడా అక్కడకు పరుగులు తీసింది. చింటూ ఒక్కడే వచ్చి లొంగిపోయినట్లు చెబుతున్నారు. అయితే కూడా ఎవరైనా వచ్చారా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లొంగిపోవడంతో ఈ కేసులో ఇప్పటివరకు 7గురు దిరికారు. మిగిలిన నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary

Chintu,the Main accused man who was involved in chittoor mayor's couple murder case was surrendered in chittoor district court