ఖైదీ నెంబర్ మారుతోందా?

Chiranjeevi 150 movie title was changing

02:50 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150 movie title was changing

రీ ఎంట్రీకి ఎక్కడ ఢోకా ఉండకూడదన్న అంచనాతో, ఎన్నో లెక్కలు వేసి ఆఖరుకి కొన్నాళ్ల కిందే చిరంజీవి 150వ సినిమా ప్రారంభించిన సంగతి తెల్సిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22న ఆ సినిమా టైటిల్ 'ఖైదీ నంబర్ 150' అని కూడా ప్రకటించేశారు. అయితే ఇప్పడు డామిట్ కధ అడ్డం తిరిగింది అనే విధంగా ఆ టైటిల్ మారనున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దానికి కారణం ఆ టైటిల్ కు అనుకున్నంత పాజిటివ్ టాక్ రాకపోవడమేనట. చిరంజీవి శ్రేయోభిలాషులతోపాటు, మెగా అభిమానులకు కూడా ఆ టైటిల్ అంతగా నచ్చలేదట. ఈ టైటిల్ ప్రకటించిన వెంటనే చిత్ర యూనిట్ ఇన్నర్ గా సేకరించిన ఫీడ్ బ్యాక్ లో ఈ విషయం బయటపడిందని అంటున్నారు.

మరోపక్క సోషల్ నెట్వర్క్ సైట్లలోనూ ఈ టైటిల్ పట్ల పాజిటివ్ స్పందన రావడం లేదట. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 786' సినిమా చేసిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా ఉందని అంటున్నారట. ఇక ఏమీ లేవన్నట్టు ఆ టైటిల్ ను ఇప్పుడు కాపీ కొట్టినట్టు ఉందే తప్ప.. కొత్తగా, పవర్ ఫుల్ గా ఏమీ లేదని అందరూ అంటున్నారట. దీంతో అవసరమైతే ఈ టైటిల్ ను మార్చాలనే యోచనలో మెగా ఫ్యామిలీ ఉన్నట్టు టాలీవుడ్ టాక్. అసలు ఎలాంటి టాక్ వస్తుందో చూసాకే అసలు టైటిల్ ఎనౌన్స్ చేయాలని ముందే ఓ ప్లాన్ వేశారని మరో కధనం వినిపిస్తోంది. అదే కనుక జరిగితే మరో టైటిల్ పెట్టడం ఖాయం.

ఇది కూడా చదవండి: ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్!

ఇది కూడా చదవండి: పుట్టబోయే పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి?

ఇది కూడా చదవండి: భర్తపై కోపం ... కొడుకుపై ప్రతాపం (వీడియో)

English summary

Chiranjeevi 150 movie title was changing. Chiranjeevi 150th movie Khaidi No. 150 movie title was changing.